Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియాంక గాంధీ కంటే అందగత్తెలున్నారు.. ఓటు హక్కు అమ్మాయి పరువు కంటే ఎక్కువ..

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్లుగా ఆమె పేరును ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ, ప్రియాంకా గాంధీ కన్నా అందమైన మహిళలు చాలామంది ఉన్నారని వినయ్ కతియార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertiesment
BJP
, బుధవారం, 25 జనవరి 2017 (15:23 IST)
కొంతమంది బీజేపీ ఎంపీలకు నోటి దురుసు ఎక్కువని అందరికీ తెలిసిందే. అత్యాచారాలు, మహిళలపై నోటికొచ్చినట్లు మాట్లాడే కొందరు బీజేపీ ఎంపీలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ, సీనియర్ నేత వినయ్ కతియార్, జేడీయూ అధ్యక్షుడు సీనియర్ నేత శరద్ యాదవ్‌‍లు నోరు జారారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీపై వినయ్ కతియార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్లుగా ఆమె పేరును ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ, ప్రియాంకా గాంధీ కన్నా అందమైన మహిళలు చాలామంది ఉన్నారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకతో పోలిస్తే.. నటీమణులు ఎందరో బాగుంటారని.. వారిని ముందు నిలిచి ప్రచారం చేసుకోవాలని కతియార్ సూచించారు. కతియార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. 
 
ఇదిలా ఉంటే.. గతంలో దక్షిణాది మహిళలు నల్లగా ఉంటారని రాజ్యసభలో వ్యాఖ్యానించి.. విమర్శలు ఎదుర్కొన్న జేడీయూ అధ్యక్షుడు సీనియర్ నేత శరద్ యాదవ్.. తాజాగా ఓటు విలువను ప్రజలకు తెలియజేయాలన్న తొందరలో నోరు జారారు. ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఓటు విలువ అమ్మాయి పరువు కంటే ఎక్కువన్నారు. కన్న కూతురి పరువు కన్నా ఓటు వేయడమే ముఖ్యమని చెప్పారు. 
 
కూతురిపై అత్యాచారం జరిగితే, ఆ గ్రామానికి మాత్రమే చెడ్డ పేరు వస్తుందని, ఓ కుటుంబానికి మాత్రమే అన్యాయం జరిగినట్టని అభివర్ణించిన ఆయన, ఓటును అమ్ముకుంటే, దేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందన్నారు. ఈ వ్యాఖ్యలతో శరద్ యాదవ్ మళ్లీ చిక్కుల్లో పడినట్టే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ పార్లమెంట్ సాక్షిగా.. మహిళా ఎంపీపై లైంగిక వేధింపులు.. ఆఫీసుకి రమ్మని?