Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్ పార్లమెంట్ సాక్షిగా.. మహిళా ఎంపీపై లైంగిక వేధింపులు.. ఆఫీసుకి రమ్మని?

మహిళలకు ఇంట్లోనూ-వీధిలోనూ కాదు.. పార్లమెంట్‌లోనూ రక్షణ లేదు. ఇందుకు మనదేశ పార్లమెంట్ వేదిక కాలేదు కానీ.. పాకిస్థాన్ పార్లమెంట్‌ సాక్షిగా ఓ మహిళా ఎంపీ లైంగిక వేధింపులకు గురయ్యారు. స్వయంగా మంత్రి ఆమెను

పాకిస్థాన్ పార్లమెంట్ సాక్షిగా.. మహిళా ఎంపీపై లైంగిక వేధింపులు.. ఆఫీసుకి రమ్మని?
, బుధవారం, 25 జనవరి 2017 (15:10 IST)
మహిళలకు ఇంట్లోనూ-వీధిలోనూ కాదు.. పార్లమెంట్‌లోనూ రక్షణ లేదు. ఇందుకు మనదేశ పార్లమెంట్ వేదిక కాలేదు కానీ.. పాకిస్థాన్ పార్లమెంట్‌ సాక్షిగా ఓ మహిళా ఎంపీ లైంగిక వేధింపులకు గురయ్యారు. స్వయంగా మంత్రి ఆమెను తన కార్యాలయంలోని పిలిపించి మరీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన ఎంపీ నుస్రాత్ సహార్ అబ్బాసీని.. పార్లమెంటులోని తన వ్యక్తిగత కార్యాలయానికి పిలిచిన మంత్రి ఇమాద్ పితాఫీ, ఆమపై వేధింపులకు ఒడిగట్టాడు. 
 
ఈ ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని... దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని నుస్రాత్ ఆరోపించారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న తనపై లైంగిక వేధింపులు జరగడం సిగ్గుచేటని ఆమె మీడియాతో తన గోడును తెలియజేశారు. మీడియా కారణంగా నుస్రాత్ వేధింపుల వ్యవహారం బయటపొక్కడంతో నుస్రాత్ ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్టు ఫెడరల్ పార్టీ వర్గాలు తెలిపాయి. 
 
ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌లో మహిళలకు భద్రత కరువైంది. హక్కులపై పోరాడితే పరువు హత్యలు చేస్తున్నారని, యాసిడ్ దాడులకు పాల్పడుతున్నారని మహిళలు వాపోతున్నారు. రోడ్లపై మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలొచ్చినా.. మహిళలపై నేరాలు ఏమాత్రం తగ్గట్లేదని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జల్లికట్టుకు మళ్లీ కష్టాలు.. సుప్రీంలో పిటిషన్ దాఖలు.. 30న విచారణ..