Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంకయ్యాజీ... ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యత మీదే... ప్రధాని మోడీ

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను కట్టబెట్టారు.

Advertiesment
వెంకయ్యాజీ... ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యత మీదే... ప్రధాని మోడీ
, సోమవారం, 13 మార్చి 2017 (09:44 IST)
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను కట్టబెట్టారు. యూపీలోని ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎవరిని సీఎంగా ఎంపిక చేయాలన్నదానిపై నివేదికను పార్టీ అధిష్టానానికి వెంకయ్య సమర్పిస్తారు. ఈ నివేదిక ఆధారంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు తుది నిర్ణయం తీసుకుంటారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. మొత్తం 403 సీట్లున్న యూపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఏకంగా 325 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో యూపీలో 14 యేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే, సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
ఈ పదవి కోసం నలుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నలుగురిలో ఇద్దరు కేంద్ర మంత్రులు కాదా, ఒకరు ఆ రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు, మరొకరు బీజేపీ ఎంపీ ఉన్నారు. మరోవైపు యూపీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం మార్చి 16న జరగనుంది. ఆ రోజునే యూపీ ముఖ్యమంత్రి ఎవరో తేలే అవకాశముంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నా.. మీరంటే ఎనలేని గౌరవం... తుదిశ్వాస వరకు మీ వెంటే ఉంటా.. చంద్రబాబుతో నాగిరెడ్డి చివరి మాటలు