Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసినా.. బలం నిరూపించుకోవడం?: శివసేన

దక్షిణభారత దేశంలో బీజేపీకి చెందిన తొలి ముఖ్యమంత్రి యడ్యూరప్పే. యడ్డీ ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 2008 తర్వాత బీజేపీ నుంచి బయటికి వచ్చి సొం

యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసినా.. బలం నిరూపించుకోవడం?: శివసేన
, గురువారం, 17 మే 2018 (15:06 IST)
దక్షిణభారత దేశంలో బీజేపీకి చెందిన తొలి ముఖ్యమంత్రి యడ్యూరప్పే. యడ్డీ ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 2008 తర్వాత బీజేపీ నుంచి బయటికి వచ్చి సొంతంగా కర్ణాటక జనతా పక్ష అనే పార్టీని స్థాపించారు. అయితే 2014లో ఆ పార్టీని బీజేపీలో కలిపేసి మళ్లీ సొంతగూటికి వచ్చేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి అత్యధిక స్థానాలు తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
 
ప్రమాణ స్వీకారం అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ.. ఫ్లోర్ టెస్టుకు మరో రెండు రోజులు వేచి చూడాలన్నారు. కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 78, జేడీఎస్ 38 స్థానాల్లో గెలిచింది. శాసన సభలో బలం నిరూపించుకునేందుకు యడ్యూరప్పకు గవర్నర్ 15 రోజుల సమయం ఇచ్చారు. దీంతో యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కర్ణాటకలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం సరికాదని.. విమర్శలొస్తున్నాయి. 
 
తాజాగా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన స్పందించింది. మెజార్టీ ఎవరికి ఉంటే వారిని గవర్నర్ పిలవాలని చెప్పింది. తద్వారా గవర్నర్ తీరును తప్పుబట్టింది. జేడీఎస్ - కాంగ్రెస్ పార్టీలకు మెజార్టీ ఉందని శివసేన అభిప్రాయపడింది. యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సరికాదని అభిప్రాయపడింది. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినా బలం నిరూపించుకోవడం అంత సులభం కాదని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటకపై బాబు, స్టాలిన్ ఫైర్... రాజ్‌భవన్ ముందే స్నానపానాదులు చేసివుంటే?