Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నుపుర్ శర్మ - నవీన్ జిందాల్‌పై వేటు వేసిన బీజేపీ

Nupur Sharma
, సోమవారం, 6 జూన్ 2022 (12:45 IST)
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మతో ఢిల్లీ మీడియా ఇన్‌చార్జి నవీన్ జిందాల్‌పై భారతీయ జనతా పార్టీ హైకమాండ్ వేటు వేసింది. వీరిద్దరికి పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను రద్దు చేసింది. 
 
ఇటీవల వీరిద్దరూ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. మైనార్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని, పౌరులు ఏ మతానికి చెందినవారైనప్పటికీ స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని, దీన్ని తాము గౌరవిస్తామని పేర్కొంది. 
 
మరోవైపు, వీరిద్దరు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యూపీలోని కాన్పూర్‌లో ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హింస చోటుచేసుకుంది. ఈ సమయంలోనే నవీన్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధిష్టానం ఆగ్రహానికు గురయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరెన్సీ నోట్లపై ఆ ఇద్దరి మహనీయులు బొమ్మలు - పరిశీలిస్తున్న ఆర్బీఐ