హనుమంతుడి జన్మస్థలంపై సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. హనుమంతుడు జన్మించింది కిష్కిండ, అంజనాద్రినేకాకుండా మహారాష్ట్రలోని అంజనేరి కూడా కాదని వాదిస్తున్నారు. తాజాగా ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత కుమారుడైన శ్రీనివాస్ ఖలాప్ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. హనుమంతుడు గోవాలో జన్మించారని వాదిస్తున్నారు.
శ్రీమండలాచార్య మహత్ పీఠాదిపతి స్వామి అనికేత్ శాస్త్రి దేశ్‌పాండే మహారాజ్ ఆధ్వర్యంలో మే 31వ తేదీన నాసిక్‌లో ధర్మ సంసద్ ఏర్పాటు చేశారు. వాల్మీకి రామయాణాన్ని చేతబట్టిన ధర్మ సంసద్‌కు చేరుకున్న మహంత్ గోవింద్ దాస్ స్వామి హనుమంతుడి జన్మస్థలంపై తన వాదనను బలంగా వినిపించారు. దీనిపై ప్రతివాదులు ఆయనపై ఆగ్రహించారు. ఈ కారణంగా హనుమంతుడి జన్మస్థలంపై వివాదం చెలరేగింది.
ఈ నేపథ్యంలో గోవా మాజీ మంత్రి రమాకాంత్ ఖలాప్ కుమారుడై శ్రీనివాస్ ఖలాప్ గోవాలోని అంజేదేవి ద్విపమే ఆంజనేయ స్వామి జన్మస్థలమని, వాల్మీకి రామాయణం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందని శ్రీనివాస్ ఖలాప్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం మీడియాకు వెల్లడించారు.