Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మసాజ్ చేయించుకుంటూ.. బూతులు తిడుతూ.. ఫిర్యాదు తీసుకుంటావా?

Advertiesment
మసాజ్ చేయించుకుంటూ.. బూతులు తిడుతూ.. ఫిర్యాదు తీసుకుంటావా?
, శనివారం, 20 అక్టోబరు 2018 (12:27 IST)
పోలీస్ స్టేషన్లోనే మసాజ్ చేయించుకుంటూ.. బాధితుల నుంచి నిర్లక్ష్యంగా ఫిర్యాదు స్వీకరించాడు ఏఎస్సై. అంతే అతడిని వేటుపడింది. ఈ ఘటన బీహార్‌లోని కైమూర్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మసాజ్ చేయించుకుంటూ, ఫిర్యాదుదారులను బూతులు తిడుతూ కనిపించాడు. ఆ తర్వాత నిర్లక్ష్యంగా బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న ఏఎస్సై వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. 
 
ఏఎస్సై వెనక నిలబడిన ఓ వ్యక్తి అతనికి మసాజ్ చేస్తుంటే అతడు నిర్లక్ష్యంగా బాధితుల ఫిర్యాదు వింటున్నాడు. అంతేకాక, మధ్యమధ్యలో వారిని బూతులు తిడుతుండడం కూడా వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో దీనినే ఫిర్యాదుగా స్వీకరించిన అధికారులు దర్యాప్తు జరిపారు. ఏఎస్సైని జాఫర్ ఇమామ్‌గా గుర్తించిన కూమూర్ ఎస్పీ అతడిని సస్పెండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గర్భాశయ మార్పిడితో తొలి కాన్పు సక్సెస్