Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీహార్‌లో వింత.. 40 మంది భార్యలకు ఒకే భర్త!

Advertiesment
Bihar Caste Census
, బుధవారం, 26 ఏప్రియల్ 2023 (10:30 IST)
దేశంలో వెనుకబడిన రాష్ట్రంగా చెప్పుకునే బీహార్ రాష్ట్రంలో ఓ వింత సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా 40 మంది భార్యలకు ఒకే ఒక భర్త ఉన్నాడు. ఈ మేరకు ప్రభుత్వ రికార్డుల్లో అతని పేరు కూడా నమోదైవుంది. ఈ వివరాలు తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు అవాక్కయ్యారు. 
 
బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం రెండో దశ కులగణన జరుగుతోంది. అందులో భాగంగా కులం, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి విషయాలు తెలుసుకునేందుకు.. ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి తిరుగుతున్నారు. అందులో భాగంగానే అర్వల్‌ జిల్లాలోని ఓ రెడ్‌లైట్‌ ఏరియాలో నివాసం ఉంటున్న వారి వివరాలు సేకరించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లారు. అక్కడ సుమారు 40 మంది మహిళలు.. తమ భర్త పేరు రూప్‌చంద్‌ అని చెప్పారు. చాలా మంది పిల్లలు సైతం తమ తండ్రి పేరు రూప్‌చంద్‌ అని తెలిపారు. 
 
దీంతో అధికారులు అవాక్కయ్యారు. అనంతరం ఎందుకు అలా చెబుతున్నారని ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది.. ఆ రెడ్‌లైట్‌ ఏరియాలో రూప్‌చంద్‌ అనే డ్యాన్సర్‌ ఉన్నాడు. అతడు చాలా ఏళ్లుగా పాటలు పాడుతూ.. డాన్స్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి అక్కడ సొంత నివాసం కూడా లేదు. అయినప్పటికీ.. అతడిపై అభిమానంతోనే మహిళలు రూప్‌చంద్‌ పేరును.. తమ భర్త పేరుగా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఉండేవారికి కులం అంటూ ఏదీ లేదని అధికారులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో 15 రోజుల్లో వివాహం.. కబళించిన రోడ్డు ప్రమాదం