Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాట్నా వేదికగా విపక్షాల భేటీ.. హాజరుకానున్న రాహుల్ - స్టాలిల్ - మమత

nitish kumar
, గురువారం, 8 జూన్ 2023 (11:26 IST)
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి నడవాలని భావిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ సారథ్యంలో ప్రతిపక్ష నేతలంతా ఒకచోట భేటీకానున్నారు. ఈ నెల 23న పాట్నావేదికగా వీరంతా సమావేశమవుతున్నారు. ఈ విషయాన్ని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రకటించారు. 
 
బుధవారం ఆయన జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్‌తో కలిసి విలేకరులతో మాట్లా డారు. నిజానికి ఈ సమావేశం ఈ నెల 12న జరగాల్సి ఉండగా కాంగ్రెస్, డీఎంకే చేసిన వినతి మేరకు తేదీలను మార్చినట్టు చెప్పారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, మమత(టీఎంసీ), స్టాలి న్(డీఎంకే), కేజీవాల్ (ఆప్), సొరేన్ (జేఎంఎం), శరద్ పవార్(ఎన్సీపీ), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన-యూబీటీ), అఖి లేష్(ఎస్పీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐ-ఎంఎల్) హాజరు కానున్నారు. కాంగ్రెస్ తరపున రాహుల్, ఖర్గేలు సమావేశానికి హాజరవుతారని ఆ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ధ్రువీకరించారు. 
 
మరోవైపు, దేశంలో ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని శరద్ పవార్ అన్నారు. కర్ణాటక ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటున్న దేశ ప్రజలు, అదే మార్పు దేశమంతా రావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఆలోచనా ధోరణి ఇదే మాదిరిగా కొనసాగితే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మార్పును చూస్తామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒడిశా రైలు ప్రమాద మృతులను గుర్తించేందుకు కృత్రిమ మేథ