Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14 యేళ్ళ బాలికను రేప్ చేస్తూ 9 సార్లు గర్భవతిని చేసిన విద్యాధికారికి జీవితశిక్ష!

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో దారుణం జరిగింది. 34 యేళ్ళ విద్యా అధికారి 14 యేళ్ళ బాలికను పెళ్లి పేరుతో అనుభవించి 9 సార్లు గర్భవతిని చేశాడు.

Advertiesment
Bidar man who
, శనివారం, 4 జూన్ 2016 (17:39 IST)
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో దారుణం జరిగింది. 34 యేళ్ళ విద్యా అధికారి 14 యేళ్ళ బాలికను పెళ్లి పేరుతో అనుభవించి 9 సార్లు గర్భవతిని చేశాడు. ఈ కేసులో ఆ కామాంధుడికి జీవిత కారాగారశిక్షతో పాటు.. రూ.50 వేల అపరాధం విధించింది. అంతేకాకుండా, అతనికి చెందిన ఆస్తిని విక్రయించిన బాధితురాలికి నష్టపరిహారంగా రూ.4 లక్షలు అందజేయాలని ఆదేశించారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మారుతి అమ్రెప్ప థారే(34) అనే వ్యక్తి బీదర్ జిల్లాలోని ఔరద్ పట్టణంలో 2002లో స్కూల్ డెవలప్‌మెంట్ మానిటరింగ్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ సమయంలో 8వ తరగతి విద్యార్థినిపై మనసు పడ్డాడు. అప్పటికే అతడికి పెళ్లి అయ్యి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాను ఇష్టపడిన ఆ 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులను అడిగాడు. అయితే వారు నిరాకరించారు. ఇక్కడే ఉంటే తమ బిడ్డను ఏం చేస్తాడోనని భయపడిన ఆమె తల్లిదండ్రులు ఆమెను చదువుకోసం మంగళూరుకు పంపించారు. 
 
ఆ విద్యార్థి ఆచూకీ తెలుసుకున్న మారుతి అక్కడికి వెళ్లి ఆమెను తన ఇంటికి తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మారుతితో తమ కుతూరు ప్రేమలో ఉందేమో అనుకుని పట్టించుకోలేదు. బాలిక తల్లిదండ్రులు కూడా పట్టించుకోకపోవడంతో మారుతి సంతోషంగా ఫీలయి బాలికను పూర్తిగా తనదాన్ని చేసుకున్నాడు. మారుతి వల్ల ఆ బాలిక 9 సార్లు గర్భం దాల్చింది. అయితే గర్భం దాల్చిన ప్రతిసారీ ఆమెకు మారుతి అబార్షన్ చేయించేవాడు. అయితే పదోసారి గర్భవతి అయినప్పుడు అబార్షన్ చేయించకపోవడంతో ఆ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 
 
తన మృగ వాంఛలు తీర్చుకోవడం కోసమే ఆమెను పెళ్లి చేసుకున్న మారుతి... బిడ్డ పుట్టడంతో అసౌకర్యంగా ఫీలయ్యి... ఆ బిడ్డను మహారాష్ట్రలోని ఉదగిర్ అనాథాశ్రమంలో వదిలేశాడు. 2012లో మరోసారి ఆమె గర్భవతి అయింది. ఎప్పటిలాగే ఆమె అబార్షన్ కోసం తీసుకెళ్లడానికి మారుతి ప్రయత్నించాడు. వయసు పెరగడంతో మానసికంగా పరిణతి చెందిన ఆమె... అబార్షన్ చేయించడం తప్పని, తాను బిడ్డను కనాలనుకుంటున్నానని చెప్పింది. ఒక్కసారిగా అతడి మాటలకు ఆమె ఎదురుచెప్పడంతో ఆగ్రహించిన మారుతి ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. 
 
దీంతో పుట్టింటికి వెళ్లిన ఆమె... పదేళ్లపాటు తనను ఒక జంతువు కన్నా హీనంగా చూసిన మారుతిపై ఔరద్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు పెట్టింది. కేసు విచారణ చేసిన పోలీసులు... నిందితుణ్ని బీదర్ జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. కేసును పరిశీలించిన అనంతరం జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంజీవ్‌కుమార్ హంచతే తీర్పునిచ్చారు. ఈ తీర్పులో మారుతికి జీవిత కారాగారశిక్షతో పాటు... 50 వేల రూపాయల అపరాధం విధించారు. అలాగే, అతని ఆస్తిని స్వాధీనం చేసుకుని దాన్ని విక్రయించి బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందజేయాలని జిల్లా యంత్రాంగానికి న్యాయమూర్తి ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరల్డ్ ఓల్డెస్ట్ గ్యాడ్యుయేట్ : 96 యేళ్ళ వయస్సులో డిగ్రీ పట్టా పుచ్చుకున్న జపాన్ తాత!