చదువుకు వయసుతో సంబంధం లేదని 96 ఏళ్ల జపాన్ వృద్ధుడు షేగేమి హిరాటా నిరూపించాడు. సరిగ్గా 85 ఏళ్ల వయస్సులో ఆయన డిగ్రీ కోర్సు ప్రారంభించి 11 ఏళ్ల తర్వాత డిగ్రీ పట్టా అందుకున్నారు షేగేమి హిరాటా. ఇప్పుడీ తాతయ్య వయస్సు 96 ఏళ్లు. పట్రభద్రుడైన షిగేమి ఎకాఎకీన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కూడా దక్కించుకున్నాడు. క్యోటో యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ నుంచి ఆయన సెరామిక్ ఆర్ట్స్‌లో డిగ్రీ పట్టాను అందుకున్నారు.
96 ఏళ్ల వయసులో కూడా పట్టుదలతో డిగ్రీని పూర్తి చేసినందుకుగాను ఆయనకు గిన్నిస్ బుక్ పర్యవేక్షకులు సర్టిఫికెట్ ఇచ్చేశారు. 1919లో హిరోషిమాలో వ్యవసాయకుటుంబంలో జన్మించిన షిగేమి హిరాటా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ నేవీలో కూడా పనిచేశారట. ఇంత లేటు వయసులో కూడా నేను కాలేజీకి వెళ్తుంటే విద్యార్థులంతా తననో సెలబ్రెటీని చూసినట్టు చూసేవారని, అది తనకెంతో సంతోషం కలిగించిందని ఆయన చెప్పారు. 100 ఏళ్లపాటు ఆరోగ్యం బతకాలన్నదే తన కోరికని చెప్పారు.