Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భరత్‌ మా వేద పురస్కారాల ప్రధానం

Bharatma Ved Puraskar
, బుధవారం, 19 అక్టోబరు 2022 (22:45 IST)
శ్రీ అశోక్‌జీ సింఘాల్‌ మహోన్నత వారసత్వంను కొనసాగిస్తూ భరత్‌మా వేద పురస్కారాలను న్యూఢిల్లీలోని చిన్నయ మిషన్‌ వద్ద వేదాలలో స్కాలర్స్‌కు అందజేశారు. వేదాలలో మహోన్నత ప్రతిభను కనబరిచిన వ్యక్తులను గుర్తించి, గౌరవించేందుకు ఈ అవార్డులను అందజేశారు. అత్యున్నత స్థాయి ఈ జాతీయ అవార్డులను ప్రతి సంవత్సరం నాలుగు విభిన్న విభాగాల్లో అందిస్తారు. అవి ఉత్తమ వేద విద్యార్థి, ఆదర్శ్‌ వేదాధ్యపక్‌; ఉత్తమ్‌ వేద విద్యాలయ మ
రియు వేదర్‌పీఠ్‌ జీవన్‌ సమ్మాన్‌. ఈ సంవత్సరం భరత్‌మా అశోక్‌ సింఘాల్‌ వేద అవార్డు, వేదర్‌పీఠ్‌ జీవన్‌ సమ్మాన్‌ అవార్డును ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన ముద్దుల్‌పల్లి సూర్యనారాయణ ఘనాపాటి అందుకున్నారు.

 
ఈ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి శ్రీ పియూష్‌ గోయల్‌  పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఇప్పుడు విశ్వగురుగా ఇండియా నిలువడానికి వేదాల తోడ్పాటు ఎంతో ఉందన్నారు. సనాతన వేదిక పరిజ్ఞాన సంప్రదాయం లేకుండా భారత ఆత్మను మనం ఊహించలేమన్నారు. మన వేదాల పట్ల యువత ఆసక్తిచూపడం ఆనందంగా ఉందన్నారు.

 
మనం పాశ్చాత్యీకరించడం కాకుండా ఆధునీకరించబడాలని స్వామి గోవింద్‌ దేవ్‌గిరిజీ అన్నారు. మన చిన్నారులు వేద విజ్ఞానం అభ్యాసించాల్సి ఉందంటూ మన సాంస్కృతిక విలువలను పెంపొందించడంలో అవి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సింఘాల్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ సలీల్‌ సింఘాల్‌జీ మాట్లాడుతూ మానవ సమస్యలన్నింటికీ మన వేదాలు పరిష్కారాలు చూపాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో నూతన శాఖను ప్రారంభించిన వర్తన ఫైనాన్స్‌