Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతిలో నూతన శాఖను ప్రారంభించిన వర్తన ఫైనాన్స్‌

Cash
, బుధవారం, 19 అక్టోబరు 2022 (22:31 IST)
అల్పాదాయ వర్గాలకు ప్రైవేట్‌ పాఠశాల విద్య ఋణాలతో పాటుగా దేశీయంగా ఉన్నత విద్య ఋణాలను అందించడం ద్వారా సుప్రసిద్ధమైన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) వర్తన ఫైనాన్స్‌ నేడు తిరుపతిలో తమ నూతన శాఖను ప్రారంభించింది. ఈ శాఖ ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్‌/తెలంగాణా రాష్ట్రాలలో సంస్ధ శాఖల సంఖ్య ఆరుకు చేరంది. ఈ శాఖలు నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్‌, విశాఖపట్నం, కర్నూలులో ఉన్నాయి.
 
తిరుపతి, చుట్టు పక్కల చిత్తూరు, పీలేరు, చంద్రగిరి, మదనపలి ప్రాంతాలలో 1000కు  పైగా అందుబాటు ధరల్లోని ప్రైవేట్‌ స్కూల్‌ వినియోగదారులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా తమ ఆర్ధిక, ఆర్ధికేతర సేవలను బలోపేతం చేయనుంది. ఈ సందర్భంగా వర్తన ఫైనాన్స్‌ సీఈఓ, కో-ఫౌండర్‌ స్టీవ్‌ హార్డ్‌గ్రావ్‌ మాట్లాడుతూ, ‘‘తిరుపతిలో నూతన శాఖ ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ప్రైవేట్‌ పాఠశాలలు, దేశీయంగా ఉన్నత విద్యనభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు విద్యా ఋణాలను అందించడం ద్వారా అంతరాలను పూరించడంతో పాటుగా భారతదేశంలో ఎంప్లాయబిలిటీ సైతం  మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకున్నాము. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో ఇప్పటి వరకూ 700కు పైగా పాఠశాలలకు ఋణాలను వర్తన అందజేసింది’’ అని అన్నారు.
 
అందుబాటు ధరల్లోని ప్రైవేట్‌ పాఠశాలలకు  ఆర్ధిక, ఆర్థికేతర మద్దతు అందించడం ద్వారా నాణ్యమైన విద్యను విద్యార్ధులకు చేరువ చేసే దిశగా తమ శాఖలను ఏర్పాటుచేస్తున్నామంటూ ప్రతి శాఖలోనూ ఐదుగురు రిలేషన్‌షిప్‌ మేనేజర్లు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పాఠశాలల అవసరాలను తీర్చనున్నామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెప్పులకు బురద అంటిందని విద్యార్థులను చితకబాదాలా?