Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలి ది కంక్లూజన్.. ప్రేక్షకుడి దృక్కోణం నుంచి లైవ్ అప్ డేట్.. పిచ్చెక్కిపోతోంది.. పరమాద్భుతం

మా స్నేహితుడు, సహోద్యోగి గురువారం రాత్రి పది గంటల ఆటకు బాహుబలి-2 టిక్కెట్ సంపాదించి ఆఫీసుకు సగం రోజు లీవు పెట్టి మరీ థియేటర్‌కు వెళ్లాడు. 12 గంటల ప్రాంతంలో ఇంటర్వెల్ సమయంలో బయటకు వచ్చి పోన్ చేశాడు. ఎలా ఉంది సినిమా అంటే తొలి భాగం చూశాను. పిచ్చెత్తిపోత

Advertiesment
బాహుబలి ది కంక్లూజన్.. ప్రేక్షకుడి దృక్కోణం నుంచి  లైవ్ అప్ డేట్.. పిచ్చెక్కిపోతోంది.. పరమాద్భుతం
హైదరాబాద్ , శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (03:08 IST)
ఎట్టకేలకు బాహుబలి డే వచ్చేసింది. ఎస్ఎస్ రాజమౌళి ఫాంటసీ చిత్రం రెండో భాగం బాహుబలి ది కంక్లూజన్‌ను అడియన్స్ చూసే సమయం వచ్చేసింది. విడుదల తేదీకి ఒక రోజు ముందే అంటే ఏప్రిల్ 27 గురువారం రాత్రి 8 గంటలకే బాహుబలి-2 థియేటర్లలో విడుదల అయిపోయింది. హైదరాబాద్‌లో సినిమాటోగ్రపీ శాఖ, సెన్సార్ బోర్డ్ సభ్యులు ఎల్బీ నగర్ లోని విజయలక్ష్మి థియేటర్‌లో చట్ట విరుద్ధంగా బాహుబలి 2ని ముందస్తుగా విడుదల చేశారని దాడిచేసి సినిమా ప్రదర్శనను మూసివేయించినా  నగరంలోని చాలా థియేటర్లలో గురువారం రాత్రి 8 గంటలకే సినిమా మొదలైపోయింది. 
 
ప్రాంతీయ భాషా చిత్రంగా భారీ బడ్డెట్‌తో మొదలుపెట్టిన బాహుబలి సినిమా తొలిభాగం సాధించిన అద్బుత విజయంతో ఈ ఎపిక్ డ్రామా ప్రాంతీయ, దేశీయ సరిహద్దులు దాటిపోయి అంతర్జాతీయ కీర్తిని పొందింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని యావత్ ప్రపంచం ప్రశ్నిస్తూ సమాధానం కోసం వెర్రెత్తిపోతున్న తరుణంలో ఇది అంతర్జాతీయ ప్రాజెక్టు అయిపోయింది.
 
ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం విడుదలైన బాహుబలి 2 ట్రెయిలర్ రోజుల వ్యవధిలో కోట్లాది వ్యూస్ సాధించటంతో సినిమాపై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్‌డ్ బుకింగులు పూర్తయ్యాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని అంచనాలతో ట్రేడ్ సర్కిల్స్ ఈ సినిమా బ్లాక్సాఫీస్‌పై కనీవినీ ఎరుగని రీతిలో బెట్టింగ్ వేసుకుంటున్నారు. దీంతో భారతీయ చలనచిత్ర చరిత్రలో కనీవినీ ఎరుగనంత భారీ కలెక్షన్లపై బయ్యర్లు ఆశపెట్టుకున్నారు
 
బాహుబలి సినిమా అంత విలువైనదో లేదో సినిమా లైవ్ అప్ డేట్స్ చూతి స్వయంగా తెలుసుకుందాం
 
సమయం గురువారం రాత్రి 8 గంటలు. బాహుబలి-2 షో టైమ్ మొదలయింది.
 
8.15 శివగామి వాయిస్‌తో సినిమా మొదలైంది. తొలి భాగంలోని పంక్తులు, దానితర్వాత ఒక ప్రాణం థీమ్ సాంగ్ వచ్చేశాయి. 
 
8.18 టైటిల్స్ పడుతున్నాయి. తొలి భాగంలోని కీలక ఘటనలు చూపించారు, వాటి నాణ్యత అద్భుతం.
 
8.24 మహాగణపతి రథంలో బాహుబలి పరిచయ దృశ్యం. రధం, ఏనుగుల రాజమౌళి ముద్రతో ఉన్నాయి.
 
8.30 సాహోరె బాహుబలి పాట దృశ్యాలు. ఎంత గొప్పగా ఉన్నాయంటే బాహుబలి మరింత ఎత్తుకు ఎదిగిపోయాడు
 
8.40 దేవసేనగా అనుష్క పరిచయం. కుంతల రాజ్యం విజువల్స్ అద్బుతం
 
8.50 సుబ్బరాజు పాత్ర కుమార వర్మగా కనబడుతుంది. ఈ పాత్రను కామెడీ కోసమే వాడుకున్నారు.
 
9.00 కన్నా నిదురించరా సాంగ్. శ్రీకృష్ణుడిని ప్రస్తుతిస్తూ దేవసేన కమ్మటి పాట పాడుతుంది.
 
9.09 దేవసేన చుట్టూ అల్లిన కథ ఉద్విగ్నభరితంగా సాగుతోంది.
 
9.19 బాహుబలి పిండారి దగ్గుల నుంచి కుంతల రాజ్యాన్ని కాపాడిన దృశ్యం బ్రహ్మాండగా ఉంది కాని కాస్త నిడివి పెద్దది.
 
9.25 హంస నావ పాట విజువల్స్ పరమాద్భుతం..ఇక్కడ చూపించిన విజువలైజేషన్, విఎప్ఎక్స్ ఎఫెక్టులు భారతీయ వెండతెరపై ఇంతకు ముందెన్నడూ చూసి ఉండలేదు.
 
ఇంటర్వెల్ సీన్ ఒక మహా కావ్య సదృశ్యంగా ఉంది.
 
9.55 దండాలయ్యా పాట అత్యంత ఉద్వేగంగా సాగుతుంది.
 
10.10 కొంత కథ నడిచిన తర్వాత కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఇక్కడ బయటపెట్టారు.
 
10.23 శివగామి నూతన రాజుగా మహేంద్ర బాహుబలిని ప్రకటిస్తుంది. ఇక్కడ కథ బాహుబలి-1 లోని తొలి సీన్ వద్దకు వెళుతుంది.
 
10.31 ఇప్పుడు శివుడు అలియాస్ మహేంద్ర బాహుబలి తన ప్రజలతో కలిసి బల్లాల దేవుని సామ్రాజ్యంపై దాడి చేస్తాడు. యుద్ధ దృశ్యాలు అద్బుతం
 
10.50 మహేంద్ర బాహుబలి భల్లాలదేవుడిని చంపేస్తాడు. ఇదే బాహుబలి ముంగింపు. రెండో సగం పూర్తిగా కథ పునాదిగా సాగింది. క్లైమాక్స్ అత్యద్బుతంగా ముగిసింది.
 
బాహుబలి-2 అంచనాలను మించి నడిచింది. బాహుబలి-2 కంటే భారీ హిట్ సాధిస్తుంది. తొలి భాగంతో పోలిస్తే,  రెండో భాగం మంచి కథతోనూ, భారీ పనితనంతోనూ కనిపిస్తుంది. రెండో భాగంలోని రెండు పాటలు తొలిభాగంలోని పాటలకంటే ఇంకా బాగున్నాయి. అయితే మొత్తం పాటల సంఖ్యను చూస్తే బాహుబలి 1 సినిమా పాటలు కాస్త మెరుగ్గా ఉన్నాయనిపిస్తుంది
 
ఇక దీంట్లోని లోపాలు ఏవంటే. రెండో సగభాగం మధ్యలోని కథ భారంగా సాగింది. తొలిభాగంలో సాగిన పిండాీరి ఎపిసోడ్ లోని వీఎఫ్ఎక్స్ అంత నాణ్యతగా లేదనిపిస్తుంది.
 
మొత్తం మీద చూస్తే మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి మళ్లీ విజేతగా నిలిచాడు.
 
కొసమెరుపు: 
మా స్నేహితుడు, సహోద్యోగి గురువారం రాత్రి పది గంటల ఆటకు బాహుబలి-2 టిక్కెట్ సంపాదించి ఆఫీసుకు సగం రోజు లీవు పెట్టి మరీ థియేటర్‌కు వెళ్లాడు. 12 గంటల ప్రాంతంలో ఇంటర్వెల్ సమయంలో బయటకు వచ్చి పోన్ చేశాడు. ఎలా ఉంది సినిమా అంటే తొలి భాగం చూశాను. పిచ్చెత్తిపోతోంది అన్నాడు.
 
తొలిరోజు తొలి ఆట హైదరాబాద్‌లో బాహుబలి-2ని ఆఫీసుకు ఎగనామం పెట్టి మరీ వెళ్లినవాడి నోటి నుంచి వచ్చిన మాట పిచ్చెక్కిపోతోంది. ఇది చాలు.. సినిమా ఎలా ఉందో, ఎలా నడుస్తుందో చెప్పడానికి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది కాస్తా తెలుగు పిలానీగా మారింది... : ముఖ్యమంత్రి చంద్రబాబు