Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు : నేడు తొలి విడత పోలింగ్

mizoram - chhattisgarh
, మంగళవారం, 7 నవంబరు 2023 (08:07 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ మంగవాళం జరుగనుంది. ఈ దశలో బస్తర్ సహా 20 నియోజకవర్గాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. నక్సల్స్ ప్రబావిత ప్రాంతంలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఓటింగ్ జరుగుతుంది. తొలి విడత బరిలో మొత్తం 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఓటింగ్ ప్రక్రియను రెండు టైమ్ స్లాట్‌గా విభజించారు. మొదటి స్లాట్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు వరకు ఓటింగ్ జరుగనుంది. 
 
ఇక రెండో స్లాట్‌లో ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. తొలి దశ ఎన్నికల్లో బస్తర్, రాజ్‌నంద్‌గావ్ జిల్లాల నుంచి 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4078681 మంది ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు. ఇందులో 2084675 మహిళలు, 1993937 మంది పురుషులు, 69 మంది హిజ్రాలు వ్యక్తులు ఉన్నాయి. 
 
మొదటి దశ పోలింగ్‌లో పలువురు ముఖ్యనేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్‌గడ్ చీఫ్, ఎంపీ దీపక్ బైజ్ (చిత్రకూట్), మంత్రులు కవాసీ లఖ్మా (కొంటా), మోహన్ మార్కం (కొండగావ్), మహ్మద్ అక్బర్ (కవార్దా), ఛవీంద్ర కర్మతో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. 
 
బీజేపీకి చెందిన వారిలో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, మాజీ మంత్రులు లతా ఉసెండి (కొండగావ్ నియోజకవర్గం), విక్రమ్ ఉసెండి (అంతగఢ్), కేదావ్ కశ్యప్ (నారాయణపూర్), మహేష్ గగ్డా (బీజాపూర్), మాజీ ఐఏఎస్ అదికారి నీలకంఠ్ టేకం (కేష్కల్) వంటి ముఖ్య నేతలు బరిలో ఉన్నారు. అలాగే మిజోరం అసెంబ్లీ స్థానానికి ఒకే దశలోనే మంగళవారం పోలింగ్ నిర్వహించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైబర్ ముప్పు నుంచి మహిళలకు రక్షణ కల్పించాలి: కల్వకుంట్ల కవిత