Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిచ్చుపెట్టిన నాసికరకం షాంపు.. పెళ్లి రద్దు ... ఎక్కడ?

Advertiesment
marriage
, ఆదివారం, 18 డిశెంబరు 2022 (18:56 IST)
నాసికరకం షాపు (చీఫ్ షాంపు) ఓ వివాహంలో చిచ్చుపెట్టింది. ఈ చిచ్చు ఏకంగా పెళ్లి రద్దుకు దారితీసింది. వినడానికి కాస్త ఆసక్తికరంగా ఉన్న ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, అస్సాం రాష్ట్రంలోని బార్పెటా జిల్లాలోని హాలీ అనే ప్రాంతానికి చెందిన ఓ యువతికి స్థానికంగా ఉండే ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. వివాహానికి ముందు వరుడి కుటుంబం సంప్రదాయబద్ధంగా కొన్ని వస్తువులను వధువుకు పంపించారు. అందులో పలు రకాలైన బహుమతులతో పాటు ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులు ఉన్నాయి. 
 
అయితే, వారు పంపిన వస్తువుల్లో నాసిరకం షాపు (చీఫ్ షాంపు) కూడా ఉంది. దీన్ని చూసిన వధువు వరుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనకు కాబోయే భర్తకు ఓ వాట్సాప్ సందేశం పింపించింది. ఇందులో 'నీ స్థాయి ఇంతేనా?' అంటూ ప్రశ్నించింది. ఈ సందేశం చూడగానే వరుడు షాక్‌కు గురయ్యాడు. 
 
వధువు పంపిన సందేశం తనను కించపరిచేలా ఉందని అందువల్ల తనకు ఈ వివాహం వద్దంటూ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా ఈ నెల 14వ తేదీన జరగాల్సిన వివాహం ఆగిపోయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశింది. రంగంలోకి దిగిన పోలీసులు వాట్సాప్ సందేశాలను విశ్లేషిస్తున్నారు. దీనిపై తదుపరి విచారణ సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యక్తి ప్రాణాలు తీసిన మటన్ ముక్క.. ఎలా?