Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మమ్మలను ఈ జన్మలో ఓడించలేరు - కేజ్రీవాల్ : పాత వీడియో వైరల్

Advertiesment
arvind kejriwal

ఠాగూర్

, ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (17:52 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడికాగా, ఈ ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ ఘన విజయం సాధించి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో గతంలో గతంలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అయింది. ఈ జన్మకు తమను ఓడించలేరంటూ ఆయన చేసిన వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. 
 
గతంలో ఓ ప్రచార వీడియోలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, 'మోడీజీ.. మమ్మల్ని ఓడించడం మీకు ఈ జన్మలో సాధ్యంకాదు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం మీ వల్ల కాదు" అంటూ వ్యాఖ్యానించారు. కాగా, తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ఆప్ చిత్తుగా ఓడిపోవడంతో ఈ వైరల్‌ను షేర్ చేసి వైరల్ చేశారు. 
 
అలాగే, కొందరు నెటిజన్లు ఈ వీడియోకు మీమ్స్ జతచేసి పోస్ట్ చేయడంతో అవి కూడా వైరల్‌గా మారాయి. కేజ్రీవాల్ మాట్లాడిన మాటల తర్వాత వీడియోకు మీమ్స్ జతచేశారు. కేజ్రీవాల్‌ను రాహుల్ గాధీ ఆపుతున్నట్టు, మాట్లాడొద్దు, సైలెన్స్‌గా ఉండు అన్నట్టు మీమ్స్ జతచేశారు. ఆప్‌ను ఓడించడానికి వచ్చే జన్మ వరకు ఎందుకు... ఇపుడే ఓడించామంటూ బీజేపీ కార్యకర్తలు ఈ వీడియోను వైరల్ చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ మినహా ఆప్‌కు చెందిన కీలక నేతలంతా ఓడిపోయిన విషయం తెల్సిందే. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : ఆప్‌కు తగ్గిన 10 శాతం ఓట్లు.. కోల్పోయిన సీట్లు 40