Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్టికల్ 370కి మంగళం... అధికారికంగా ప్రకటించిన రాష్ట్రపతి

ఆర్టికల్ 370కి మంగళం... అధికారికంగా ప్రకటించిన రాష్ట్రపతి
, గురువారం, 8 ఆగస్టు 2019 (10:37 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి (ప్రత్యేక రాజ్యాంగం)ని కల్పించే ఆర్టికల్ 370 పూర్తిగా రద్దు అయినట్టు భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అధికారికంగా ప్రటించారు. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ జారీచేసింది. 
 
కాగా, ఇటీవల ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ పార్లమెంట్ ఉభయ సభలూ తీర్మానం చేసిన విషయం తెల్సిందే. దీనికి సంబంధించిన బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఆ తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపించగా ఆయన కూడా సంతకం చేసి ఆమోదించారు. 
 
దీంతో 370 అధికరణకు సంబంధించిన అన్ని నిబంధనలు శాశ్వతంగా రద్దయ్యాయి. ఇప్పటి నుంచి ఈ నిబంధన చెల్లుబాటులో ఉండదని బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 నిబంధన 3(రెడ్‌విత్ క్లాజ్ 3) ద్వారా రాష్ట్రపతికి సమకూరిన అధికారాల మేరకు పార్లమెంటు సిఫారసుతో ఆగస్టు ఆరు నుంచే ఈ ఆర్టికల్ రద్దు అయినట్టు పేర్కొంది. 
 
ఈ మేరకు రాష్ట్రపతి సంతకంతో కూడిన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఆర్టికల్ 370లో సవరణలు చేసినవి, ఎలాంటి మార్పులు, మినహాయింపులు లేని అన్ని రాజ్యాంగ నిబంధనలు జమ్ముకాశ్మీర్‌కు వస్తాయని ఆ నిబంధనలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శత్రుచెరలోనూ అసమాన్య ధైర్యసాహసాలు... అభినందన్‌కు "వీర్ చక్ర"