భారత్‌కి మరో వైరస్ నుంచి ఆరోగ్య విపత్తు పొంచి ఉందని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) హెచ్చరించింది. దాని పేరు ‘క్యాట్ క్యూ వైరస్’(సీక్యూవీ) అని వెల్లడించింది.
ఆర్ర్దోపోడ్ వర్గానికి చెందిన జీవులను వాహకాలుగా వాడుకొని ఈ వైరస్ వ్యాపిస్తుందని తెలిపింది. క్యూలెక్స్ జాతి దోమలు, పందులను ఈ వైర్‌సలు ఆవాసాలుగా మార్చుకుంటాయని చైనా, తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనాల్లో వెలుగుచూసిందని గుర్తుచేసింది.
దేశవ్యాప్తంగా సేకరించిన 883 సీరం శాంపిళ్లను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) శాస్త్రవేత్తలు పరీక్షించగా, రెండు నమూనాల్లో క్యాట్ క్యూ వైర్‌సను తిప్పికొట్టే ఐజీజీ యాంటీబాడీల జాడను గుర్తించారు.
ఈ కొత్త వైరస్ వల్ల మలేరియా, డెంగీ, హంటావైర్‌సతో తలెత్తే రుగ్మతలు, మెనింజైటిస్, పిడియాట్రిక్ ఎన్‌సెఫలైటిస్ ప్రబలొచ్చని తెలిపింది.