Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసలు వెంటిలేటర్ అంటే ఏంటి? అదేం తమషా కాదు, ఎలా వుంటుందో తెలుసా?

అసలు వెంటిలేటర్ అంటే ఏంటి? అదేం తమషా కాదు, ఎలా వుంటుందో తెలుసా?
, సోమవారం, 28 సెప్టెంబరు 2020 (14:10 IST)
మీరు ఈ కింద సూచించిన జాగ్రత్తలు జాగ్రత్తగా చదివారంటే ఇంటి నుండి బయటకే రారు! మరీ ముఖ్యంగా 60 ఏళ్లు పైనపడి ఉన్నవారు ఇంట్లోనే ఉండాలి మరియు ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు.
 
వెంటిలేటర్ల గురించి తెలుసుకోండి
వెంటిలేటర్‌లో ఉండడం అంటే ఏమిటో అర్థం కానివారు, అడ్డంగా తిరిగి మాల్స్ లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లోకి వెళ్లేసి జాలీగా తిరిగి ఆనందం పొందాలనుకునే వారు తెలుసుకోండి. మీరు తెలుసుకోవలసినది ఏంటంటే, వెంటిలేటర్ నోటిపై ఉంచిన ఆక్సిజన్ మాస్క్ కాదు, రోగి హాయిగా పడుకుని పత్రికలు చదువుతు రిలాక్స్ గా ఉండేందుకు అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు.
 
* కోవిడ్ -19 కోసం వెంటిలేషన్ అనేది బాధాకరమైన ఇంట్యూబేషన్‌తో మొదలవుతుంది. ఇది గొంతు ద్వారా క్రిందకు వెళ్లి రోగి జీవించే వరకు లేదా రోగి చనిపోయే వరకు అక్కడే ఉంటుంది.

ఇక అనస్థీషియాలో 2 నుండి 3 వారాల వరకు కదలకుండా, తరచుగా తలక్రిందులుగా, నోటి నుండి శ్వాసనాళం వరకు ఒక గొట్టంతో చొప్పించబడుతుంది. ఊపిరితిత్తుల యంత్రం యొక్క లయకు ఊపిరి పీల్చుకోవడానికి రోగికి అనుమతిస్తుంది.
 
* రోగి మాట్లాడలేరు, తినలేరు, లేదా సహజంగా ఏమీ చేయలేరు - యంత్రం రోగిని సజీవంగా ఉంచుతుంది అంతే. దీని నుండి వారు అనుభవించే అసౌకర్యం మరియు నొప్పి అంతాఇంతా కాదు. యంత్రానికి అవసరమైనంత కాలం ట్యూబ్ టాలరెన్స్ ఉండేలా వైద్య నిపుణులు మత్తుమందులు మరియు నొప్పి నివారణ మందులను ఇవ్వాలి. ఇది కృత్రిమ కోమాలో ఉండటం లాంటిదన్నమాట.
 
* ఈ చికిత్సలో 10-20 రోజుల తరువాత, ఒక యువ రోగి 40% కండర ద్రవ్యరాశిని కోల్పోతాడు. నోరు లేదా స్వరతంతువుల గాయం, అలాగే పల్మనరీ లేదా గుండె సమస్యలను పొందుతాడు.
 
* ఈ కారణంగానే వృద్ధులు లేదా అప్పటికే బలహీనంగా ఉన్నవారు చికిత్సను తట్టుకోలేక చనిపోతారు. మనలో చాలా మంది ఈ పడవలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మునిగే అవకాశాన్ని పొందకూడదనుకుంటే తప్పక సురక్షితంగా ఉండాలి. అదే భౌతిక దూరం, తప్పనిసరిగా మాస్కులు, చేతులు శుభ్రం వంటికి ప్రధానం.

ఆ.. ఏంటి కరోనావైరస్ ఏం చేస్తుందిలే అనుకుంటే, అది ఏమయినా చేయవచ్చు. ఒక్కసారి ఒంట్లోకి ఇంట్లోకి వచ్చిందంటే ఇక దాని జాతర ఎలా వుంటుందో అనుభవించినవారికే తెలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భగ్గుమన్న దేశ రాజధాని : అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా ఉత్తరాదిలో నిరసనలు