Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్ నుంచి కోలుకున్నారా?... అయితే ఒక్క నిమిషం!

కోవిడ్ నుంచి కోలుకున్నారా?... అయితే ఒక్క నిమిషం!
, మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (19:30 IST)
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అంతేస్థాయిలో ఉంటోంది. దీనికి తోడు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ సోకి కోలుకున్నవారు నిర్లక్ష్యంగా ఉండవద్దని.. వైరస్ సోకిన సమయం కంటే ఆ తర్వాత రోజులే ముఖ్యమైనవని వైద్యులు సూచిస్తున్నారు. 
 
కోవిడ్‌ నుంచి కోలుకోగానే ఇక తాము వైరస్‌ను జయించామని.. తమ ఆరోగ్యానికి ఢోకా లేదనే అతివిశ్వాసంతో వ్యవహరించవద్దని, అలా అని మరీ భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 
 
కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత నిర్లక్ష్యంగా ఉంటే గుండె, మెదడు, కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తే ముప్పు ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో కోవిడ్ రీఇన్ఫెక్షన్‌ కేసులు ఇప్పుడిప్పుడే వెలుగుచూస్తున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్నంత మాత్రాన దానినుంచి దీర్ఘకాలిక రక్షణ పొందగలిగేంత రోగ నిరోధక శక్తిని పొందినట్లు కాదు.

కోవిడ్ యాంటీబాడీలు కొందరిలో మూడు నెలలు, మరికొందరిలో ఆరు నెలలు క్రియాశీలంగా ఉంటాయని అధ్యయనాల్లో వెలుగుచూసినట్టు వైద్యులు గుర్తు చేస్తున్నారు. కొంతమందిలో యాంటీబాడీలు తగినంతగా వృద్ధి చెందకపోతే మరోసారి ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇన్ఫెక్షన్‌ రాకముందు ఎలా అప్రమత్తంగా ఉన్నారో.. కోలుకున్న తర్వాత కూడా అంతే అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.
 
ముఖ్యంగా గుండె, కిడ్నీ, మధుమేహం, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్లు అదనపు అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుంది.
 
ఈ క్రింది జాగ్రత్తలు అవసరం: 
1) స్టెరాయిడ్స్ వాడిన వారిలో సుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉండవు. కాబట్టి తరచూ చెకప్ చేయించుకుంటూ ఉండాలి.
 
2) ఊపిరితిత్తులు ఎక్కువ ప్రభావానికి గురై ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఫోన్లలో మాట్లాడకూడదు. ఆయాసం ఎక్కువగా ఉంటే న్యుమోథొరాక్స్ అనే సమస్య తలెత్తవచ్చు. దీంతో ఛాతిలో ఐసిడి అనే పైపు వేయవలసి రావచ్చు.
 
3) దగ్గు ఎక్కువగా వస్తున్నట్టయితే సెకెండరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. యాంటీబయోటిక్స్ వాడవలసి వస్తుంది.
 
4) జ్వరం మళ్లీ వస్తున్నట్టయితే బ్రెయిన్ ఎఫెక్టు ఉండవచ్చు. సీఎస్ఎప్ అనాలసిస్ అవసరం. 
 
5) కిడ్నీ మరియు ఇతర సమస్యలు కూడా రావచ్చు. 
 
5) 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే వైద్య సహాయం తీసుకోవాలి.
 
ఏది ఏమైనా  వైరస్ యొక్క ప్రవృత్తి  రోజురోజుకి మారుతూ ఉండటంతో, మనందరం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 24 గంటల్లో 10,601 కరోనా కేసులు