Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హఫీజ్ సయీద్‌ను రెండుసార్లు కలిశా.. కంట్రోల్ రూమ్‌తో టచ్‌లో ఉంటా: మరో కసబ్?

కాశ్మీర్‌లోని పాక్ ఆక్రమిత ప్రాంతంలో ఇంకా అలజడి నెలకొని వుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నౌగామ్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందగా, బహదూర్ అలీ అనే టెర్రరిస్టును భద

హఫీజ్ సయీద్‌ను రెండుసార్లు కలిశా.. కంట్రోల్ రూమ్‌తో టచ్‌లో ఉంటా: మరో కసబ్?
, శుక్రవారం, 29 జులై 2016 (17:27 IST)
కాశ్మీర్‌లోని పాక్ ఆక్రమిత ప్రాంతంలో ఇంకా అలజడి నెలకొని వుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా నౌగామ్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందగా, బహదూర్ అలీ అనే టెర్రరిస్టును భద్రతాదళాలు పట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాక్ ఉగ్రవాది బహదూర్ ఆలీ అలియాస్ సైఫుల్లా  అలీ వద్ద భద్రతా దళాలు జరిపిన విచారణలో షాక్ ఇచ్చే వివరాలు బయటికొచ్చాయి. 
 
అమాయక ప్రజలను చంపేందుకే తాను భారత్‌లో చొరబడినట్లు బహదూర్ అంగీకరించాడు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థల్లో గెరిల్లా యుద్ధ విద్యలో రాటు తేలినట్లు చెప్పాడు. ఈ క్రమంలో జమాత్ - ఉద్ - దవ్హా చీఫ్ హఫీజ్ సయీద్‌ను రెండుసార్లు కలిసినట్లు వివరించాడు. 
 
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కంట్రోల్ రూమ్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటానని సైఫుల్లా చెప్పుకొచ్చాడు. ఇక ఇతడి వద్ద మూడు ఏకే 47 రైఫిల్స్, రెండు గన్స్, రూ.23వేల భారతీయ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా సైఫుల్లా మరో కసబ్ అవుతాడని విశ్లేషకులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెక్స్ వర్కర్‌తో రాత్రంతా మజా.. రూ.500 తక్కువగా ఇచ్చి సిగరెట్‌తో వాతలు పెట్టారు!