Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖర్చులు పెరిగాయ్ ఎక్కువ కావాలన్న సెక్స్ వర్కర్... సరేనని రాత్రంతా గడిపి అదనంగా సిగరెట్ వాతలు...

ముంబైలో ఓ సెక్స్ వర్కర్‌ను ఇద్దరు విటులు మోసం చేశారు. రాత్రంతా ఆమెతో పడక సుఖం పంచుకున్న ఆ ఇద్దరు విటులు.. తాము మాట్లాడుకున్న మొత్తం కంటే రూ.500 తక్కువ ఇవ్వడమే కాకుండా 4 గంటల పాటు చిత్ర హింసలు పెట్టి..

Advertiesment
Miffed
, శుక్రవారం, 29 జులై 2016 (17:17 IST)
ముంబైలో ఓ సెక్స్ వర్కర్‌ను ఇద్దరు విటులు మోసం చేశారు. రాత్రంతా ఆమెతో పడక సుఖం పంచుకున్న ఆ ఇద్దరు విటులు.. తాము మాట్లాడుకున్న మొత్తం కంటే రూ.500 తక్కువ ఇవ్వడమే కాకుండా 4 గంటల పాటు చిత్ర హింసలు పెట్టి... సిగరెట్‌తో వాతలు కూడా పెట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ముంబై మహానగరంలో అతుబా అనే వ్యక్తికి ఓ సెక్స్‌వర్కర్‌తో పరిచయం ఉంది. దీంతో తన కోర్కెను తీర్చుకునేందుకు అపుడపుడూ ఇంటికి పిలిచేవాడు. అలా వచ్చినపుడల్లా రూ.1000 చెల్లిస్తూ వచ్చాడు. అయితే, ఖర్చులు పెరిగాయని, అందువల్ల తనకు రూ.1500 ఇవ్వాలంటూ సెక్స్ వర్కర్ పట్టుబట్టింది. దీనికి తొలుత సమ్మతించిన అతుబా... తన పని పూర్తయ్యాక.. ఆ మొత్తంలో డబ్బు ఇవ్వలేదు కదా కోపోద్రిక్తుడై తన స్నేహితుడు అఫ్జల్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. 
 
ఇదే అదనుగా భావించిన అతను.. ఆ మొత్తం తాను ఇస్తానని చెప్పి... ఆమెను తన ఇంటికి పిలిపించుకున్నాడు. అతను కూడా ఆమెతో శృంగారంలో పాల్గొని చెప్పిన మాట ప్రకారం రూ.1500 ఇచ్చాడు. ఇంతలో మళ్లీ కోర్కె కలగడంతో అతుబా అఫ్జల్ ఇంటికి వచ్చి.. ఆమెతో మరోమారు సెక్స్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆమె డబ్బులు అడగడంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయి... బెల్టు తీసుకుని ఇష్టం వచ్చినట్టు చితకబాదాడు. అప్పటికీ కోపం చల్లారక పోవడంతో సిగరెట్‌ కాల్చి ఒళ్లంతా వాతలు పెట్టాడు. ఇలా దాదాపు 4 గంటలపాటు ఆమెను అత్యంత కిరాతకంగా హింసించాడు.
 
చివరకు వేకువజామున ముంబైలోని జయదేవ ఆస్పత్రి ప్రాంతంలో ఆమెను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అయితే, ఈ సెక్స్ వర్కర్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి... అతుబాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతుబా కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18 నెలల పాటు టీచర్‌పై ప్రిన్సిపల్ వేధింపులు.. భర్త వార్నింగ్ ఇచ్చినా నో యూజ్.. చివరికి..?