Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సర్జికల్స్ స్ట్రైక్స్‌పై డిజిఎంఓ ప్రకటన చేసినా నమ్మవా? కేజ్రీవాల్ ఏంటిది?: అన్నా హజారే

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదంటూ వస్తున్న ఆరోపణలపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. సర్జికల్ స్ట్రైక్స్ బూటకమని ఆరోపిస్తున్న ఢిల్లీ సీఎం అరవిం

సర్జికల్స్ స్ట్రైక్స్‌పై డిజిఎంఓ ప్రకటన చేసినా నమ్మవా? కేజ్రీవాల్ ఏంటిది?: అన్నా హజారే
, బుధవారం, 5 అక్టోబరు 2016 (17:48 IST)
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదంటూ వస్తున్న ఆరోపణలపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. సర్జికల్ స్ట్రైక్స్ బూటకమని ఆరోపిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా అన్నాహజారే ఫైర్ అయ్యారు. భారత ఆర్మీ దాడులు చేయడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదులు తెలిపిన కేజ్రీవాల్.. ఆ దాడులు జరిగిందనడానికి తగిన సాక్ష్యాలు విడుదల చేయాలని డిమాండ్ చేయడంపై అన్నాహజారే ఫైర్ అయ్యారు.  
 
సర్జికల్ స్ట్రైక్స్‌పై ఇండియన్ ఆర్మీ డిజిఎంఓ స్వయంగా ప్రకటన చేసినా నమ్మవా? అని ఆయన కేజ్రీవాల్‌ను అన్నా హజారే నిలదీశారు. అంతేకాకుండా ఇండియన్ ఆర్మీని కేజ్రీవాల్ నమ్మకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గతంలో సైన్యంలో పనిచేసిన హజారే దేశం కోసం ఏ క్షణమైనా యుద్ధరంగంలో కాలుపెట్టడానికి సిద్ధమని ప్రకటించారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై ఇండియన్ ఆర్మీని హజారే అభినందించారు. భారతసైన్యం పరాక్రమం ప్రపంచానికి తెలిసేలా చేశారని అన్నా హజారే ప్రశంసలు గుప్పించారు. 
 
ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొత్తగా 12 ఉగ్రవాద శిబిరాలు వెలసినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ శిబిరాలకు పాకిస్థాన్ సైన్యం రక్షణ కల్పిస్తున్నట్లు సమాచారం. బుధవారం దేశ భద్రతపై జరిగిన కేబినెట్ కమిటీ హై లెవల్ భేటీలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ దీని గురించి ప్రధానికి వివరించి చెప్పినట్లు సమాచారం. 
 
కొత్తగా వెలసిన 12 శిబిరాల్లో ఉన్న సుమారు వంద మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోడీకి దోవల్ వెల్లడించారు. ఒక్కో శిబిరంలో దాదాపు 40 నుంచి 50 మంది పాక్ సైనికులు రక్షణగా ఉన్నట్లు అజిత్ దోవల్ వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్ గెలుస్తాడో ఏంపాడో... త్వరగా ఆ పనులు చేసేయండి... మోదీ సర్కార్ ఉరుకులు పరుగులు