Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రంప్ గెలుస్తాడో ఏంపాడో... త్వరగా ఆ పనులు చేసేయండి... మోదీ సర్కార్ ఉరుకులు పరుగులు

డోనాల్డ్ ట్రంప్ నోటిదూలతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పబ్లిసిటీ సంపాదించేశారు. ఇక ఆయనపై విమర్శలంటారా... వేరే చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతో భారత్ ఎదుర్కొంటున్న సమస్యల నేపధ్యంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే ఇండియాకు

Advertiesment
america first
, బుధవారం, 5 అక్టోబరు 2016 (17:14 IST)
డోనాల్డ్ ట్రంప్ నోటిదూలతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పబ్లిసిటీ సంపాదించేశారు. ఇక ఆయనపై విమర్శలంటారా... వేరే చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతో భారత్ ఎదుర్కొంటున్న సమస్యల నేపధ్యంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే ఇండియాకు కొద్దిగా ఇబ్బందులు తప్పవనే వాదనలు వినబడుతున్నాయి. ముఖ్యంగా ఆయన అమెరికా ఫస్ట్ అనే నినాదంపై చాలా అర్థాలను వెతుకుతున్నారు. ఆసియా దేశాల్లో ఇండియాతో గతంలో అమెరికా అధ్యక్షులు మైత్రీ బంధాన్ని సాగించారు. 
 
కానీ ట్రంప్ మాత్రం ముందు మన దేశం గురించి ఆలోచించాలి. ఆ తర్వాత మిగిలిన దేశాల సంగతి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన వ్యవహారం చూస్తుంటే భారతదేశానికి కూడా మొండిచెయ్యి చూపిస్తారేమోననే సందేహాలు తలెత్తుతున్నాయి. అందువల్ల ఒబామా హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ సత్వరమే పట్టాల పైకి వచ్చేట్లు చూడాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. 
 
ఇందుకుగాను సంబంధిత అధికారులతో చకాచకా పనులు చక్కబెట్టుకుంటోంది. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించిన అనేక కీలక ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చేలా చూస్తోంది. మొత్తమ్మీద ట్రంప్ వ్యాఖ్యల కల్లోలం మన దేశాన్ని కూడా కాస్త ఆలోచనలో పడవేసేట్లు చేసిందన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిక్కర్లు వేసుకొని కవాతు చేయకూడదు: ఆర్ఎస్ఎస్‌కి మద్రాసు హైకోర్టు ఆదేశాలు