Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చరిత్ర సృష్టించిన రిషి సునక్... జీవితం అందమైనదన్న ఆనంద్ మహీంద్రా

anand mahindra
, మంగళవారం, 25 అక్టోబరు 2022 (08:22 IST)
బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన పౌరుడు రిషి సునక్ ఎన్నికయ్యారు. ఆయనను బ్రిటన్ అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు ఏకగ్రీవంగా ప్రధానిగా ఎన్నుకున్నారు. తద్వారా ఆయన రిషి సునక్ చరిత్ర సృష్టించారు. దీనిపై భారత పారిశ్రామికదిగ్గజం ఆనంద్ మహీంద్రా స్పందించారు. 
 
భారతీయుల తక్కువ స్థాయి కలిగి, వారి శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయన్న విన్‌స్టన్ చర్చిల్ వ్యాఖ్యలను ఆనంద్ మహీంద్రా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన వ్యాఖ్యలు గుర్తు చేస్తూ జీవితం అందమైనదని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 
 
వివిధ రకాలైన ఆరోపణల నేపథ్యంలో ప్రధాని పీఠం నుంచి బోరిస్ జాన్సన్ తప్పుకున్నారు. ఆ తర్వాత హోరాహోరీగా సాగిన బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. అయితే, ఆమె సారథ్యంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోయింది. దీంతో ఆమె 45 రోజులకే తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 
ఫలితంగా బ్రిటన్ కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్, రిషి సునాక్‌లు పోటీపడ్డారు. అయితే, బోరిస్ జాన్సన్ తప్పుకోవడంతో రిషి సునక్ ఎన్నిక లాంఛనమే అయింది. భారత్‌ను పాలించిచన బ్రిటన్ ఇపుడు భారతీయ మూలాలు ఉన్న రిషి సునక్ ఎన్నిక కావడంపై ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు స్పందిస్తున్నారు. 
 
సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా ఉండే ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ గతంలో భారతీయలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. "1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వేళ భారత్‌లోని నాయకులందరూ తక్కువ స్థాయి కలిగి ఉంటారని, వారిలో తక్కువ శక్తి సామర్థ్యాలు ఉంటాయని చర్చల్ అన్న మాటలను గుర్తు చేసిన ఆనంద్ మహీంద్రా... 75 యేళ్ల తర్వాత భారత మూలాలు ఉన్న ఓ వ్యక్తి బ్రిటన్ పగ్గాలు చేపట్టడం ద్వారా చర్చిల్ మాటలకు జవాబు ఇచ్చారని, జీవితం అందమైనదని" ట్వీట్ చేశారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో సూర్యగ్రహణం 25-10-22, ఏ సమయంలో, ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుంది?