Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైలు వచ్చే శబ్ధం వినిపించలేదు.. అందుకే రావణ దహనంలో...

Advertiesment
రైలు వచ్చే శబ్ధం వినిపించలేదు.. అందుకే రావణ దహనంలో...
, శనివారం, 20 అక్టోబరు 2018 (10:49 IST)
దసరా ఉత్సవాల్లో భాగంగా రావణ దహనం చేస్తుండగా.. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. ఈ శబ్దాలకు రైల్వే ట్రాక్‌పై నిల్చున్నవారు తమపైకి రైళ్లు వస్తున్నట్టు గుర్తించలేకపోయారు. దీంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. రైలు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చిందని పంజాబ్‌ పోలీసులు భావిస్తున్నారు. 
 
అధికార యంత్రాగం, దసరా కమిటీల నిర్వాకమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. రైలు వెళ్తున్నప్పుడు కనీసం అప్రమత్తం చేసి ఉంటే... ఇంతటి ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదంటున్నారు. ముందే అప్రమత్తం చేసి ఉంటే రైలు వేగం తగ్గి నిదానంగా వచ్చేదని వారన్నారు.
 
పంజాబ్‌లోని అమృ త్‌సర్‌లో రావణ దహన వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకుంది. నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానికులు జోదా ఫటక్‌ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌కు సమీపంలో రావణ దహన కార్య క్రమాన్ని నిర్వహించారు. 
 
అదే సమయంలో రెండు వైపుల నుంచీ రెండు రైళ్లు హఠాత్తుగా రావడంతో ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలపై నిల్చున్న వారిపైకి ఈ రైళ్లు దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సెల్ఫీల కోసం.. వీడియోల కోసం రైలు పట్టాలపై నిలబడటంతోనే భారీ ప్రాణనష్టం జరిగిందని పోలీసులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లితో అక్రమ సంబంధం వున్న వ్యక్తిని హతమార్చారు.. మర్మాంగాన్ని కోసి?