Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

శివ భక్తులకు శుభవార్త : రెండేళ్ల తర్వాత అమర్నాథ్ యాత్ర

Advertiesment
Amarnath Yatra 2021
, సోమవారం, 22 మార్చి 2021 (15:02 IST)
దేశంలోని శివభక్తులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా నిలిపివేసివున్న అమర్నాథ్ యాత్రను ఈ యేడాది తిరిగి పునరుద్ధరించనున్నారు. 
 
ఈ యాత్ర ప్రతి యేడాది జూన్ 28వ తేదీన ప్రారంభమై.. ఆగస్టు 22వ తేదీ వరకు కొనసాతుంది. అంటే ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర మొత్తం 56 రోజుల పాటు కొనసాగుతుంది. 
 
అమర్‌నాథ్ యాత్ర మందిర బోర్డు తీర్థయాత్రకు రిజిస్ట్రేషన్ తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 14 నుంచి భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని బోర్డు సూచించింది.
 
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా అమర్‌నాథ్ యాత్రను గత సంవత్సరం రద్దు చేయాల్సి వచ్చింది. ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్స్ 370, 35-ఏ ను రద్దు చేయడం, పూర్వ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం వల్ల 2019లో కూడా అమర్‌నాథ్ యాత్ర నిలిపివేయాల్సి వచ్చింది.
 
జమ్మూకాశ్మీర్ అధికారులు ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాలు ప్రారంభించారు. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు సమావేశం జరిగింది.
 
మహాశివరాత్రి పండుగకు ముందు అమర్‌నాథ్ యాత్ర 2021 ప్రారంభ తేదీని ప్రకటించవచ్చని ఊహాగానాలు వచ్చాయి. 2021 జనవరిలో పుణ్యక్షేత్ర బోర్డు సమావేశం జరిగింది. రెండేండ్ల అనంతరం అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభిస్తుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22-03-2021 సోమవారం దినఫలాలు - శంఖరుడుని పూజించినా...