Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిక్కుల్లో అఖిలేష్ యాదవ్... అండగా నిలిచిన మరో బాబాయ్

ఎస్పీ అధినేత ములాయం సింగ్ కుటుంబంలో చిచ్చుపుట్టింది. ములాయం కుటుంబంలో రాజకీయ చిచ్చు రగులుతూ, రెండు వర్గాలు తయారయ్యాయంటున్న రాజకీయ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ, ఆయన మరో సోదరుడు అఖిలేష్‌కు మద్దతు పలి

Advertiesment
చిక్కుల్లో అఖిలేష్ యాదవ్... అండగా నిలిచిన మరో బాబాయ్
, గురువారం, 15 సెప్టెంబరు 2016 (14:56 IST)
ఎస్పీ అధినేత ములాయం సింగ్ కుటుంబంలో చిచ్చుపుట్టింది. ములాయం కుటుంబంలో రాజకీయ చిచ్చు రగులుతూ, రెండు వర్గాలు తయారయ్యాయంటున్న రాజకీయ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ, ఆయన మరో సోదరుడు అఖిలేష్‌కు మద్దతు పలికారు. 
 
తన మంత్రివర్గంలో ఉన్న బాబాయ్ శివపాల్ యాదవ్‌కు ఉద్వాసన పలికిన తర్వాత, ఆయన్ను శాంతింపజేసేందుకు అఖిలేష్‌ను పార్టీ రాష్ట్రాధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించాలని ములాయం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ పదవిని శివపాల్‌కు ఇచ్చిన తర్వాత బుధవారం, యూపీలో, ఢిల్లీలో భారీ రాజకీయమే జరుగగా, అసెంబ్లీ రద్దుకు అఖిల్ యత్నిస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి.
 
ఓవైపు తన సోదరుడు, మరోవైపు కన్న బిడ్డల మధ్య సమన్వయం కోసం ములాయం ప్రయత్నిస్తున్న వేళ, ఆయన ఇంకో సోదరుడు రాంగోపాల్ యాదవ్, తాను అఖిలేష్ వైపున్న సంకేతాలిచ్చారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పిస్తున్నట్టు అఖిలేష్‌కు చెప్పకపోవడం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. 
 
"ఓ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ, అతని అనుమతి తీసుకోకపోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతుంది. ఎన్నికలు రానున్న వేళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వాటిని పంచుతానని చెప్పి గౌరవంగా అఖిలేష్‌తో రాజీనామా చేయించి ఉండవచ్చు" అని వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యను హతమార్చాడు.. తలను వేరు చేసి ఊరంతా ఊరేగించాడు.. ఆలయ తలుపుల వద్ద?