Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యను హతమార్చాడు.. తలను వేరు చేసి ఊరంతా ఊరేగించాడు.. ఆలయ తలుపుల వద్ద?

భార్యపై అనుమానంతో ఆ భర్త కిరాతకంగా వ్యవహరించాడు. అనుమానంతో భార్యను వేధించడమే కాకుండా.. ఆమెను దారుణంగా హతమార్చి.. తలను వేరు చేసి.. ఊరంతా ఊరేగించాడు. ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతి చెందారు. పోలీసులకు సమ

Advertiesment
lcoholic Man Chops Off Wife's Head In Front Of Kids
, గురువారం, 15 సెప్టెంబరు 2016 (14:00 IST)
భార్యపై అనుమానంతో ఆ భర్త కిరాతకంగా వ్యవహరించాడు. అనుమానంతో భార్యను వేధించడమే కాకుండా.. ఆమెను దారుణంగా హతమార్చి.. తలను వేరు చేసి.. ఊరంతా ఊరేగించాడు. ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతి చెందారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈ దుర్ఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వెళ్లాలన్‌కుళం గ్రామానికి చెందిన ముత్తురాజ్‌(47)కు భార్య కాంచన అలియాస్‌ జమున(45), ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో భార్యపై అనుమానం పెంచుకున్న ముత్తురాజ్ ఆమెతో గొడవకు దిగేవాడు. కొట్టేవాడు. నానా హింసలు పెట్టేవాడు. అయినా ఆమె సహించింది. కానీ ముత్తురాజ్ మాత్రం తనలోని అనుమాన భూతానికి పనిచెప్పాడు. ఫూటుగా మందేసి ఇంట్లో పిల్లలెవరూ లేని సమయాన్ని చూసి ముత్తురాజ్‌ తన భార్య కత్తితో హతమార్చాడు.

అక్కడితో ఆగకుండా తలను వేరు చేసి వీధులలో ఊరేగించి, ఆలయ తలుపుల వద్ద పెట్టాడు. ఈ ఘటనను చూసిన గ్రామస్థులు షాక్ తిన్నారు. స్థానికుల సమాచారంతో ముత్తురాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని కోర్టు ముందు హాజరు పరిచి.. జైలుకు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌కు మరో షాక్.. టిడిపిలోకి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు...? ప్ర‌కాశం జిల్లా ఖాళీ