Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దినకరన్ కేసులో మరో వికెట్ డౌన్ : ఎయిర్‌పోర్టులో హవాలా బ్రోకర్ అరెస్ట్

రెండాకుల గుర్తు కోసం లంచం ఇవ్వజూపిన వ్యవహారంలో మరో హవాలా బ్రోకర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్‌ను అరెస్టు చేసి లోతుగా విచారణ జరుపుతున్

దినకరన్ కేసులో మరో వికెట్ డౌన్ : ఎయిర్‌పోర్టులో హవాలా బ్రోకర్ అరెస్ట్
, శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (13:40 IST)
రెండాకుల గుర్తు కోసం లంచం ఇవ్వజూపిన వ్యవహారంలో మరో హవాలా బ్రోకర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్‌ను అరెస్టు చేసి లోతుగా విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. 
 
కాగా, అన్నాడీఎంకే పార్టీ అధికారిక రెండాకుల గుర్తు దక్కేందుకు ఈసీకి లంచం ఇచ్చేందుకు సిద్ధమై.. ఇందుకోసం రూ.60 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో రూ.10 కోట్లను ముందు ఇచ్చేందుకు ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని హవాలో బ్రోకర్ల ద్వారా చెల్లించేందుకు దినకరన్ ప్రయత్నాలు మొదలెట్టారు. 
 
ఈ కేసులో మొదట దినకరన్ మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖరన్‌ను ఆ తర్వాత దినకరన్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం దినకరన్ ఐదు రోజుల విచారణకు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ విచారణలో భాగంగా, ఢిల్లీ నుంచి దినకరన్‌ను చెన్నై తీసుకెళ్లిన ఢిల్లీ పోలీసులు దినకరన్ భార్యను ప్రశ్నించారు. 
 
ఈసందర్భంగా తమిళనాడు అన్నాడీఎంకే చిన్నమ్మ శశికళ ఆదేశం మేరకే దినకరన్ ముడుపులు ఇవ్వజూపారన్న సాక్ష్యాలు సేకరించారు. దీంతో దినకరన్‌ను తీసుకుని ఢిల్లీ పోలీసులు బెంగళూరు బయల్దేరారు. అక్కడ పరప్పన అగ్రహార జైలులో ఉన్న శశికళను కూడా విచారించనున్నారు. 
 
అనంతరం సుఖేష్ చంద్రశేఖరన్‌కు 10 కోట్ల రూపాయలు అందజేసిన హవాలా ఏజెంట్ నరేష్‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థాయ్‌లాండ్ పర్యటన ముగించుకుని వచ్చిన నరేష్‌ను డిల్లీ పోలీసులు, ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్.. నీకు సిగ్గుందా...? 'నీ పార్టీకి మగతనం లేదన్న దయాకర్‌ను పార్టీలోకి చేర్చుకుంటావా'?