Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హత్రాస్ తరహాలో యూపీలో ఘోరం.. మత్తు మందిచ్చి అత్యాచారం.. కాళ్లు విరిచి రిక్షాలో..?

Advertiesment
హత్రాస్ తరహాలో యూపీలో ఘోరం.. మత్తు మందిచ్చి అత్యాచారం.. కాళ్లు విరిచి రిక్షాలో..?
, గురువారం, 1 అక్టోబరు 2020 (07:31 IST)
యూపీ మహిళలపై అకృత్యాలకు అడ్డాగా మారిపోతుంది. యోగి సర్కారు మహిళలపై జరిగే ఘోరాలను నియంత్రించడంలో విఫలమయ్యారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటన మరవకముందే యూపీలో మరో ఘోరం జరిగింది. బల్‌రామ్‌పూర్ జిల్లాలో మరో దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది.
 
హత్రాస్ బాధితురాలు లాగే ఈమె కూడా.. తీవ్ర గాయాలతో మరణించింది. ఘటనపై బాధితురాలు కుటుంబ సభ్యులు గైంస్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రకారం.. 22 ఏళ్ల దళిత యువతి బల్‌రామ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. ఉదయం ఆఫీసుకు వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తోంది. కానీ మంగళవారం అలా జరగలేదు. రాత్రైనా ఇంటికా రాకపోయేసరికి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఫోన్ చేసినా అటు వైపు నుంచి స్పందనలేదు. 
 
చివరకు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ ఆటో రిక్షాలో అపస్మారక స్థితిలో యువతి ఇంటికి వచ్చింది. ఐతే ఆమె పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఒంటి నిండా గాయాలు కనిపించాయి. చేతికి గ్లూకోజ్ డ్రిప్ ఇంజెక్షన్ కనిపించింది. ఏదో జరిగిందని భయపడిపోయిన బాధితురాలి కుటుంబ సభ్యులు.. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ మార్గమధ్యలోనే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. 
 
ఐతే చనిపోయే ముందు ఇద్దరు వ్యక్తుల పేర్లను తల్లిదండ్రులకు వెల్లడించింది. పోలీసులకు నిందితులకు పేర్లను చెప్పారు పేరెంట్స్. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఈ కేసులో నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు బలరాంపూర్ ఎస్పీ దేవ్ రంజన్ వర్మ తెలిపారు.అత్యాచారానికి ముందు తమ కూతురికి మత్తు ఇంజెక్షన్‌కు ఇచ్చారని.. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని బాధితురాలు తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. 
 
రెండు కాళ్లను విరిచేసి.. రిక్షాలో పంపారని తెలిపింది. ఐతే పోలీసులు మాత్రం మృతురాలు నడుము, కాళ్లు విరిచేశారన్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో సీఎం యోగిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జవాన్లకు కరోనా.. ఒక్క రోజే 82మందికి కోవిడ్ పాజిటివ్.. 58 మంది మృతి