Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసలే కరోనా టెన్షన్.. చిన్న పిల్లలకు 4 నెలల్లో పోలియో లాంటి వ్యాధి

అసలే కరోనా టెన్షన్.. చిన్న పిల్లలకు 4 నెలల్లో పోలియో లాంటి వ్యాధి
, గురువారం, 19 ఆగస్టు 2021 (16:48 IST)
కరోనా టెన్షన్‌లో ఉన్న ప్రజలకు ఆరోగ్య శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. వచ్చే నాలుగు నెలల్లో చిన్న పిల్లలకు పోలియో లాంటి అక్యూట్ ఫ్లాసిడ్ మైలిటిస్ (ఎఎఫ్ఎమ్) అనే వ్యాధి వ్యాప్తి చెందుతుందని యునైటెడ్ స్టేట్స్ ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ వ్యాధి నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు హెచ్చరికలు జారీ చేసింది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC). 
 
"తల్లిదండ్రులు మరియు వైద్యులు ఆకస్మిక అవయవ బలహీనత కలిగిన రోగులలో, ముఖ్యంగా ఆగస్టు నుండి నవంబర్ వరకు AFM ని అనుమానించాలి. ఇటీవలి శ్వాసకోశ అనారోగ్యం లేదా జ్వరం మరియు మెడ లేదా వెన్నునొప్పి లేదా ఏదైనా నరాల లక్షణం వారి ఆందోళనను పెంచాలి" అని హెచ్చరించింది. 
 
AFM అనేది మెడికల్ ఎమర్జెన్సీ, కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా తొందరగా వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ వ్యాధి ఇప్పుడే వ్యాప్తి చెందదని.. వచ్చే నాలుగు నెలల్లో వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న‌వ‌రత్నాల‌పై న‌ట‌ర‌త్నాల అన్వేష‌ణ‌! షార్ట్‌ఫిల్మ్‌–2021