Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెప్టెన్ విజయకాంత్ ఇకలేరు.. కెరీర్ విశేషాలు

Advertiesment
vijayakanth
, గురువారం, 28 డిశెంబరు 2023 (09:37 IST)
vijayakanth
ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) కన్నుమూశారు. ఆయన గురువారం ఉదయం చెన్నైలో మరణించారు. అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ కొంతకాలంగా చికిత్స పొందుతు వచ్చారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు ఈరోజు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌కు తరలించారు.
 
కొన్నాళ్లుగా పార్టీ పనిలో చురుగ్గా లేని విజయకాంత్ గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రచారం చేయలేదు. విజయకాంత్ లేకపోవడంతో ఆయన సతీమణి ప్రేమలత పార్టీని నడిపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఆయన మృతి చెందారు.
 
విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. అసలు పేరు విజయరాజ్ అలకర్ స్వామి. తన కెరీర్ మొత్తంలో తమిళ సినిమాపై ప్రత్యేకంగా దృష్టి సారించిన అతికొద్ది మంది నటుల్లో విజయకాంత్ ఒకరు. అతను అభిమానులలో పురట్చి కలైంజర్, కెప్టెన్ అని ప్రసిద్ధి చెందాడు. 1979లో విడుదలైన కాజా దర్శకత్వం వహించిన ఇనికి ఇళమై మొదటి చిత్రం. విజయకాంత్ ప్రారంభ కెరీర్‌లో చాలా వరకు నటుడు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.
 
1980లలో విజయకాంత్ యాక్షన్ హీరో స్థాయికి ఎదిగారు. 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ ఇప్పటికీ తమిళ క్లాసిక్‌గా గుర్తింపు పొందారు. ఈ సినిమాతో అభిమానులు అతన్ని కెప్టెన్ అని పిలవడం ప్రారంభించారు. నూరావత్ నాల్, వైదేహి కాతిరుంతల్, ఊమై విజిగల్, పులన్ విసారనై, వీరన్ వేలుతంబి, సెందూరప్పువే, ఎంగల్ అన్నా, గజేంద్ర, ధర్మపురి, రమణ సహా 154 చిత్రాలలో ఆయన నటించారు. 
 
2010లో విరుదగిరి సినిమాతో దర్శకుడిగా మారారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చివరి చిత్రం కూడా ఇదే. 2015లో, అతను తన కుమారుడు షణ్ముఖ పాండియన్ నటించిన సాగపథం చిత్రంలో కూడా అతిధి పాత్రలో కనిపించాడు.
 
విజయకాంత్ 1994లో ఎంజీఆర్ అవార్డు, 2001లో కలైమామణి అవార్డు, బెస్ట్ ఇండియన్ సిటిజన్ అవార్డు, 2009లో టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డు, 2011లో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయకాంత్ ప్రాణాలు తీసిన కరోనా వైరస్...