Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీ - డీఎంకేలకు వ్యతిరేకంగా గెట్‌ఔట్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేయండి : హీరో విజయ్

Advertiesment
vijay

ఠాగూర్

, బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (14:31 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యా విధానాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే స్పష్టం చేసింది. ఈ విధానాన్ని అమలు చేస్తేనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేస్తాంటూ కేంద్ర విద్యా శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన హెచ్చరించారు. దీంతో తమిళనాట మరో భాషా ఉద్యమం ఆరంభమయ్యే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినీ హీరో, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఘాటుగా స్పందించారు. ఈ రెండు పార్టీలను ఇంటికి సాగనంపడమే మేలని పిలుపునిచ్చారు. ఇందుకోసం బీజేపీ, డీఎంకేలకు వ్యతిరేకంగా గెట్‌ఔట్ అనే హ్యష్‌టాగ్‌ను ట్రెండ్ చేసి వారిని సాగనంపే దిశగా కలిసికట్టుగా కృషి చేద్దామంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
తమ పార్టీ రెండో ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని బుధవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. "నూతన విద్యా విధానం, త్రిభాషా సూత్రం అమలుపై బీజేపీ, డీఎంకేల మధ్య మాటల యుద్ధం సాగుతుందన్నారు. దీన్ని రంగస్థలంగా మార్చారు. డీఎఁకే, బీజేపీ రెండూ పెద్ద పార్టీలైనా సామాజిక మాధ్యమాల్లో హ్యాష్‌ట్యాగ్ గేమ్స్ ఆడుకుంటున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. వారి వివాదం చిన్నపిల్లల కొట్లాటలా ఉంది" అంటూ ఎద్దేవా చేశారు.
 
త్రిభాష సూత్రం అమలును అంగీకరించకపోవడంతో రాష్ట్రానికి రావాల్సిన రూ.2400 కోట్ల నిధులను నిలిపివేస్తామంటూ కేంద్ర మంత్రి బెదిరింపులకు పాల్పడినట్టు వచ్చిన వార్తలపై విజయ్ పై విధంగా స్పందించారు. కేంద్రం తీరును తప్పుబట్టారు. బీజేపీ, డీఎంకేలు నిజాయితీ లేని పార్టీలని ఆయన ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తాం : చైనా కంపెనీ హుకుం!