భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆధార్ కేంద్రానికి వెళ్లే అవసరం లేకుండానే ఇంటి వద్దే మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసే సౌకర్యాన్ని తీసుకొస్తోంది. త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి తేనున్నట్లు ఉడాయ్ తన ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేషన్‌కు ప్రస్తుతం వ్యక్తిగతంగా ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిందే. చిన్నపనే అయినా ఆధార్ కేంద్రాల వద్ద క్యూలైన్‌లో నిల్చోవాల్సిందే. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి చెక్ పెడుతూ ఉడాయ్ తన ఆధార్ యాప్‌లో కొత్త సదుపాయం తీసుకొస్తోంది. ఓటీపీ, ఆధార్ ఫేస్ అథంటికేషన్ కలిపి ఒక కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది.
మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి, ఆ తర్వాత కెమెరా ద్వారా ముఖాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. తద్వారా మొబైల్ అప్‌డేషన్‌ను సులువుగా పూర్తి చేయొచ్చు. త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని ఉడాయ్ తెలిపింది. ఇందుకోసం ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వారు ఫీడ్‌బ్యాక్‌ను తమతో పంచుకోవాలని కోరింది.