సర్జికల్ స్ట్రయిక్స్ ఎలా జరిగాయో తెరపై చూడొచ్చు..? సినిమా వచ్చేస్తోంది...
సర్జికల్స్ స్ట్రయిక్స్‌కు ఏడాది పూర్తయ్యింది. సరిహద్దుల వద్ద ఉద్రిక్తత, పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడం.. మిలటరీ స్థావరంపై ఉగ్రమూకల దాడికి సరైన సమాధానం ఇవ్వాలని భారత్ భావించింది. ఈ క్రమంలో గత ఏ
సర్జికల్స్ స్ట్రయిక్స్‌కు ఏడాది పూర్తయ్యింది. సరిహద్దుల వద్ద ఉద్రిక్తత, పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడం.. మిలటరీ స్థావరంపై ఉగ్రమూకల దాడికి సరైన సమాధానం ఇవ్వాలని భారత్ భావించింది. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించాయి. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించడం ద్వారా పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి.
గత ఏడాది పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దీనికి మద్దతు లభించింది. ఈ దాడులు నిర్వహించి నిన్నటికి అంటే సెప్టెంబర్ 28 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో సర్జికల్ స్ట్రయిక్స్‌పై ఢిల్లీలో రెండు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. అంతేగాకుండా సర్జికల్ స్ట్రయిక్స్ ఎలా జరిగాయనే దృశ్యాలను కళ్లకు కట్టే విధంగా సినిమా కూడా రాబోతోంది.
సర్జికల్ స్ట్రయిక్స్‌పై ''ఉడీ'' పేరుతో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి అధియా ధార్ దర్శకత్వం వహిస్తుండగా, రోన్నీ స్క్రూవాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. సర్జికల్ స్ట్రయిక్స్ టీమ్‌కి నాయకత్వం వహించిన కమాండర్‌గా విక్కీ కౌశల్ నటిస్తున్నారు.