దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద తుపాకీని ఎయిర్ పోర్టు భద్రతా అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి దుబాయ్ దేశానికి చెందిన ప్రయాణిడుగా గుర్తించారు. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమాన ప్రయాణికుల లగేజీలను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఓ బ్యాగులో తుపాకీతో పాటు రెండు మ్యాగజైన్‌లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
చెక్ ఇన్ బ్యాగులోకి పిస్టల్‌లు ఎలా తీసుకొచ్చాడన్న అంశంపై ప్రయాణికుడి వద్ద ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు. దుబాయ్ విమానాశ్రయంలో భద్రతా లోపం కారణంగానే ఇలా జరిగివుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.