ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శతాబ్దంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగహణం (Century Longest Lunar Eclipse) నవంబరు 19న ( కార్తిక పౌర్ణమి నాడు )వినువీధిలో దర్శనమివ్వబోతుంది.
ఇదే విషయాన్ని శనివారం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ (నాసా) ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 18, 19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనుండగా..
భారతకాలమానం ప్రకారం నవంబరు 19న శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి .. భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది.
3 గంటల 28 నిమిషాల పాటు ఏర్పడే ఈ పాక్షిక చంద్ర గ్రహణం.. చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చంద్రుడు ఎవరికీ కనిపించకుండా ఈ పాక్షిక గ్రహణం దాచేస్తుంది. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం.
ఈ ఏడాది తొలి చంద్ర గహణం.. మే 26 రోజున (వైశాఖ పౌర్ణమి) నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. నిండు చంద్రుడు ఆరోజు అరుణవర్ణంలో కనువిందు చేశాడు. దీన్నే బ్లడ్ మూన్ (Blood moon), సూపర్ మూన్ (Super Moon) అని అంటారు.