Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిక్ టాక్‌లో డబ్ స్మాష్‌లు, వీడియోలు పోస్టు చేస్తున్నారా?

Advertiesment
టిక్ టాక్‌లో డబ్ స్మాష్‌లు, వీడియోలు పోస్టు చేస్తున్నారా?
, మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:28 IST)
సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్లు అరచేతిలో వుండటంతో పాటు టిక్‌టాక్ వీడియోలకు బానిసైన ఓ యువతి చేసిన పని ఆమెకే ప్రమాదాన్ని కొనితెచ్చింది. సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలకు మంచి క్రేజుంది. ఈ టిక్ టాక్ వీడియోల కోసం ఓ యువతి అదే పనిగా వీడియోలను క్రియేట్ చేస్తుండేది. డ్యాన్స్ చేయడం, మిమిక్రీ, డబ్ స్మాష్ చేస్తుండేది.
 
ఈ అలవాటు ఆమెను టిక్ టాక్‌కు బానిసను చేసింది. బెంగళూరుకు చెందిన 20 ఏళ్ల ఈ యువతి టిక్ టాక్‌లో చాలా ఫేమస్. ఈమె ఏ వీడియో పోస్టు చేసినా ట్రెండ్ అయి కూర్చుంటుందట. అయితే టిక్ టాక్‌కు అడిక్ట్ అయిన ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్లలో పోస్టు చేశారని తెలిసి షాకైంది. 
 
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అతి వేగంగా చక్కర్లు కొట్టాయి. దీంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ క్రైమ్ విభాగం ద్వారా దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమకు పెద్దలు నో చెప్పారు.. ప్రియురాలిని లాడ్జికి తీసుకెళ్లి?