Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధనార్జన కోసం 11మందిని పెళ్ళి చేసుకున్న కిలేడీ.. భార్యగా నటించి.. అంతా దోచుకునేది..

ఉత్తరప్రదేశ్ కిలేడీ ధనార్జన కోసం వివాహాన్ని వృత్తిగా ఎంచుకుంది. వరుసగా 11 మందిని వివాహం చేసుకుంది. ఒకరి తర్వాత ఒకరిని లూటీ చేస్తూ భారీ మొత్తం దోచేసుకుంది. అయితే ఈ కిలేడీని పోలీసులు నోయిడాలో అరెస్ట్ చే

Advertiesment
A 28-Year-Old Woman Married 11 Men And You Won't Believe Why
, సోమవారం, 19 డిశెంబరు 2016 (15:52 IST)
ఉత్తరప్రదేశ్ కిలేడీ ధనార్జన కోసం వివాహాన్ని వృత్తిగా ఎంచుకుంది. వరుసగా 11 మందిని వివాహం చేసుకుంది. ఒకరి తర్వాత ఒకరిని లూటీ చేస్తూ భారీ మొత్తం దోచేసుకుంది. అయితే ఈ కిలేడీని పోలీసులు నోయిడాలో అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇక పోలీసులు వెల్లడించిన వివరాలకెళితే.. కోచికి చెందిన లోరెన్‌ జస్టిన్‌ అనే వ్యక్తి గత అక్టోబరులో తన భార్య మేఘ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
మేఘతో పాటు 15 లక్షల రూపాయల డబ్బు, బంగారు ఆభరణాలు మాయమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేరళ పోలీసుల బృందం నోయిడా పోలీసుల సాయంతో విచారణ చేసి.. రెండు నెలల తర్వాత మేఘతో పాటు ఆమె సోదరి ప్రాచి, సోదరి భర్త దేవేంద్ర శర్మలను అదుపులోకి తీసుకున్నారు.

డబ్బున్న పెళ్లికాని యువకులను టార్గెట్ చేసే మేఘ.. అందంతో పాటు అదృష్టం కలిసిరావడంతో 11 మందిని ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి చేసుకుంది. అందవిహీనం, వికలాంగులను మాత్రమే టార్గెట్ చేసి వారిని వివాహమాడి వారి నుంచి భారీ ఆస్తులను కైవసం చేసుకుంది. 
 
పెళ్లైన కొద్ది రోజులు అణకువ కలిగిన భార్యగా నటించి, అన్నీ దోచుకుని వెళ్లిపోవడం మేఘ స్టైల్ అని పోలీసులు తెలిపారు. ఇండోర్‌కు చెందిన ఆమె పేరు మేఘా భార్గవ్ అని, ఈ ఘరానా మోసాలకు ఆమె చెల్లి, బావ కూడా సహకరించారని పోలీసుల విచారణలో తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏటీఎం క్యూలైన్లలో సాధారణ ప్రజలు.. పని ఒత్తిడిలో బ్యాంకు సిబ్బంది ప్రాణాలు పోతున్నాయ్