Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ్యూస్ తాగమన్నాడు.. కౌగిలించుకుని.. ముద్దు పెట్టుకున్నాడు... చివరికి?

Advertiesment
Rape

సెల్వి

, సోమవారం, 28 అక్టోబరు 2024 (19:02 IST)
ఒడిశాకు చెందిన గిరిజన 23ఏళ్ల మహిళపై 75 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో పనిచేసే మహిళ పట్ల వృద్ధుడు ఈ అఘాయిత్యానికి పాల్పడాడు. నిందితుడిని ప్రభుత్వ రంగ సంస్థలో మాజీ ఉద్యోగి కె శివప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు.
 
శివప్రసాద్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందిడుతుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అక్టోబరు 15న భార్య బయటకు వెళ్లిన సమయంలో వైటిలలోని శివప్రసాద్‌ ఇంట్లో అత్యాచారం జరిగింది. సంఘటన జరిగిన ఒక రోజు తర్వాత, శివప్రసాద్, అతని కుటుంబం గురువాయూర్ ఆలయాన్ని సందర్శించడానికి బయలుదేరారు. 
 
23 ఏళ్ల మహిళ వాంగ్మూలం ఆధారంగా అక్టోబర్ 17న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 74 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. బాధితురాలు ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందినది. ఆమె సవతి తల్లి వల్ల 12 సంవత్సరాల వయస్సు నుండి ఇంటి పని చేయవలసి వచ్చింది. ఈ నెల ప్రారంభంలో శివప్రసాద్ ఇంట్లో పనికి చేరింది. 
 
వైద్య పరీక్షల అనంతరం శివప్రసాద్‌పై అత్యాచారం కేసు నమోదైంది. అక్టోబరు 15న 11 గంటల ప్రాంతంలో తన భార్య లేని సమయంలో శివప్రసాద్ హాలును శుభ్రం చేస్తుండగా ఈ అకృత్యానికి పాల్పడ్డాడని తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
జ్యూస్ తాగమని బలవంతం చేశాడని.. కౌగిలించుకుని.. ముద్దు పెట్టుకున్నాడని.. అతని నుంచి తప్పించుకుని తన గదికి పారిపోయానని.. అప్పటికే స్పృహ కోల్పోయినట్లు అనిపించిందని.. మేల్కొని చూశాక ఒంటి మీద దుస్తులు లేవని వాపోయింది.
 
ప్రైవేట్ భాగాల్లో నొప్పిని తట్టుకోలేకపోయానని.. ఆపైనే తనపై శివప్రసాద్ అత్యాచారానికి పాల్పడ్డాడనే విషయం తెలిసిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.8 కోట్ల ఆస్తి కోసం భర్తను ప్రేమికుడితో కలిసి చంపేసింది.. 800 కిలోమీటర్లు...