దిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లలో 700 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. 2,400 మందిని అరెస్టు చేశారు.
ఆయుధ చట్టం కింద 49 కేసులు నమోదయ్యాయి. ఈశాన్య దిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లపై ఇప్పటివరకు 700 కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఇప్పటివరకు 2,400 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇందులో 49 కేసులు ఆయుధ చట్టం కింద నమోదయ్యాయి. అల్లర్లు జరిగిన ప్రాంతంలో అమన్ కమిటీ 288 సమావేశాలు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈశాన్య దిల్లీలో ఫిబ్రవరి 23న సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు.