చైనా నుంచి ఢిల్లీకి కర్నూలు జ్యోతి, ఎయిర్‌ఫోర్స్ విమానంలో 112 మంది

గురువారం, 27 ఫిబ్రవరి 2020 (12:59 IST)
చైనా నుంచి ఢిల్లీకి జ్యోతి
కరోనా వైరస్‌తో విలవిల్లాడుతున్న చైనా నగరం వుహాన్ నుంచి 112 మందిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేక విమానంలో గురువారం న్యూఢిల్లీ తీసుకొచ్చారు. వీరిలో 76 మంది భారతీయులు కాగా.. 36 మంది విదేశీయులు ఉన్నారు. సీ17 విమానంలో భారత్ నుంచి 15 టన్నుల బరువైన మాస్కులు, ఇతర వైద్య సామాగ్రిని చైనా తీసుకెళ్లారు. 
 
తిరిగి వచ్చేటప్పుడు చైనాలో చిక్కుకున్న వారిని తీసుకొచ్చారు. వీరిలో కర్నూలుకు చెందిన జ్యోతి, శ్రీకాకుళం‌కి చెందిన సాయి కూడా ఉన్నారని సమాచారం. వీరందర్నీ చావ్లాలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో 14 రోజులపాటు పర్యవేక్షణలో ఉంచనున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రెండేళ్లుగా పింఛన్ వస్తలేదు బిడ్డా: కలెక్టరుతో వృద్ధ మహిళ