ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. ఈ హింసలో ఇద్దరు పోలీసులతో పాటు ఒక గ్రామ వలంటీర్‌తో సహా ఏడుగురి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మణిపూర్ వాసులు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. బిష్ణుపూర్ జిల్లాలో చెలరేగిన హింసలో నలుగురు హత్యకు గురయ్యారు. వీరితో కలుపుకుని తాజాగా హింసలో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది. వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మోరే గ్రామంలో సాయుధ మిలిటెంట్లు వీరిని కాల్చి చంపారు. మరో గ్రామంలో దుండగులతో జరిగిన ఎదురు కాల్పుల్లో విలేజ్ వలంటీర్ మృతి చెందారు.
రిజర్వేషన్లు విషయంలో కుకీల, వెయిటీలకు మధ్య రేకెత్తిన అల్లర్లతో అల్లకల్లోలంగా మారిన మణిపూర్‌లో ఇటీవల జరిగిన ఘర్షణల్లో 175మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. తాజాగా గత 48 గంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్రతకు అద్దం పడుతుంది. తాజాగా ఘర్షణల నేపథ్యంలో ప్రజల భయంభయంగా గడుపుతున్నారు.