కరోనా వైరస్ విజృంభిస్తోంది. తమిళనాడులో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదవుతుంటే.. తర్వాత దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
బుధవారం కొత్తగా తమిళనాడులో 3,943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 90వేల మార్కుకు చేరాయి.
అలాగే తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య కూడా కల్లోలం సృష్టిస్తోంది. బుధవారం తమిళనాడులో కరోనా సోకి 60 మంది మృతి చెందారు. దీంతో.. తమిళనాట కరోనా మరణాల సంఖ్య 1201కి చేరింది.