Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తరప్రదేశ్‌లో బోల్తాపడిన బస్సు - ఐదుగురి మృతి

road accident
, ఆదివారం, 7 మే 2023 (13:54 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బస్సు ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. గుర్తు తెలియని వావానాన్ని ఢీకొట్టిన బస్సు పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. జాలౌన్ జిల్లాలోని గోపాల్ పురంలో శనవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
 
పెళ్లి బృందంతో ప్రయాణస్తున్న బస్సును జాలౌన్ జిల్లాలోని గోపాల్ పుర ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా ఓ పెళ్లికి హాజరైన తిరిగి వెళుతున్నారని పోలీసులు తెలిపారు. బస్సు బోల్తా పడటంతో ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి గాయాలు అయ్యాయి. వీరందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మురికి కాలువలో కరెన్సీ నోట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం