Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నది దాటుతుండగా పడవకు చిల్లు - 40 మందికి ఏమయ్యారు..

boat
, ఆదివారం, 27 నవంబరు 2022 (10:51 IST)
కాశీ నగరంలోని గంగానదిలో బోటు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ వాసులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏపీలోని నిడదవోలు వాసులు తృటిలో ప్రాణాలతో గట్టెక్కారు. 
 
ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిస్తే, తూర్పు గోదావలి జిల్లా నిడదవోలు పరిసర ప్రాంతాలకు చెందిన 120 మంది ఈ నెల 20న తీర్థయాత్రలకు బయలుదేరారు. అలహాబాద్, గయ, అయోధ్యను సందర్శించుకుని శుక్రవారం వారణాసి చేరుకున్నారు. 
 
గంగానదిలో పిండి ప్రదానాలు చేయాలని భావించిన 40 మంది శనివారం పడవలో నది దాటుతుండగా కొంతదూరం వెళ్లాకు పడవడకు చిల్లు పడింది. అది చూసిన అందులోని వారు భయంతో కేకలు వేశారు. దీంతో బోటును వెనక్కి మళ్లించేందుకు డ్రైవర్ ప్రయత్నిస్తున్న సమయంలో వారంతా భయంతో అటూఇటూ కదలడంతో అదుపుతప్పిన బోటు బోల్తాపడింది. 
 
నదిలో పడిన వారు తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేయడంతో సమీపంలో ఉన్న మిగతా బోట్టు వారు స్పందించారు. వెంటనే అక్కడికి చేరుకుని మునిగిపోయిన 40 మందిని రక్షించారు. మరోవైపు, విషయం తెలిసిన వారణాసి కలెక్టర్, పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. ప్రమాదం అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలోనే ఓ మంచి ముహూర్తాన విశాఖ నుంచి పాలన : మంత్రి అమర్నాథ్