Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో అకాల వర్షాలు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!!

Advertiesment
deadbody

ఠాగూర్

, శుక్రవారం, 2 మే 2025 (10:30 IST)
దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఉన్నట్టుంటి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా అకాల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, వడగళ్ళు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన లుగురు ప్రాణాలు కోల్పోయారు. బలమైన గాలుల ధాటికి ద్వారక ప్రాంతంలోని ఓ వ్యవసాయ భూమిలో ఉన్న బోరుబావి గదిపై పెద్దవేప చెట్టు కూలిపడింది. దీంతో ఆ గదిలో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులు చిక్కుకుని పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది వారిని రక్షించి సమీప ఆస్పత్రికి తరలించగా వారంతా అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు. ఈ ఘటనలో ఇంటి యజమాని అజయ్‌ మాత్రం స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. 
 
ఢిల్లీలో దంచికొట్టిన వర్షం - విమాన రాకపోకల్లో ఆలస్యం 
 
ఢిల్లీలో వర్షం దంచి కొడుతోంది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను దారి మళ్లిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన కుండపోతవర్షం కురిసింది. ఈ వర్షంతో  వేసవి నుంచి ఢిల్లీ ప్రజలకు కొంతమేరకు ఉపశమనం లభించినట్టయింది. అయితే, రోజువారి దినచర్యలకు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా, ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో అనేక లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
మరోవైపు, వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో మరో 40 విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు అడ్వైజరీ జారీచేసింది. అటు ఎయిరిండియా, ఇండిగో కూడా తమ ప్రయాణికులకు అలెర్ట్ సందేశాలు పంపించాయి. తాజా అప్‌‍డేట్ కోసం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి. 
 
మరికొన్ని గంటల్లో ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో రాజధానికి రెడ్ అలెర్ట్ జారీచేసింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే తెల్లవారుజామున కురిసిన వర్షానికి లజ్‌పత్ నగర్, ఆర్కేపురం, ద్వారక తదితర ప్రాంతాల్లో వర్షపునీరు వచ్చి చేరింది. ఇటు హర్యానా రాష్ట్రంలోనూ భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఊహించని వాతావరణ మార్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పహల్గామ్ దాడికి బైసరన్ లోయలో 48 గంటలు గడిపిన టెర్రరిస్టులు