Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమకోసం దేశ సరిహద్దులను అక్రమంగా దాటివచ్చి... బెంగుళూరులో అరెస్టయ్యారు...

ప్రేమకోసం దేశ సరిహద్దులను అక్రమంగా దాటివచ్చిన ముగ్గురు పాకిస్థానీయులతో పాటు.. కేరళ యువకుడిని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, వీరివద్ద జరిపిన విచారణలో ఆసక్తిక

Advertiesment
Pak Nationals
, శుక్రవారం, 26 మే 2017 (12:23 IST)
ప్రేమకోసం దేశ సరిహద్దులను అక్రమంగా దాటివచ్చిన ముగ్గురు పాకిస్థానీయులతో పాటు.. కేరళ యువకుడిని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, వీరివద్ద జరిపిన విచారణలో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 
 
ఉద్యోగం కోసం మస్కట్‌కు వెళ్లిన కేరళ యువకుడు ఓ పాకిస్థానీ అమ్మాయిపై మనసుపడ్డాడు. దీంతో వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇంతలో పాకిస్థాన్‌కు చెందిన మరో యువతి యువకుడు ప్రేమించుకున్నారు. ఈ రెండు జంటల ప్రేమకథలకు ఖతార్‌ వేదికైంది. ఆ తర్వాతే వీరి కథ మలుపుతిరిగింది. ఖతార్ నుంచి నేపాల్‌కు, రోడ్డు మార్గం ద్వారా పాట్నాకు అటు నుంచి బెంగళూరుకు వచ్చి స్థిరపడ్డారు. 
 
ఈ విషయాన్ని బెంగుళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు పసిగట్టారు. దేశంలోకి అక్రమంగా వచ్చారన్న అభియోగంపై వీరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, కేరళకు చెందిన యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాఘా సరిహద్దు ద్వారా భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్‌కు చెందిన అబ్దుల్లా షా (21) అనే మరో యువకుడిని బీఎస్ఎఫ్ అధికారులు అరెస్ట్‌ చేశారు. పాక్‌లోని స్వాత్ తన స్వస్థలమని విచారణలో అతడు చెప్పాడు. 
 
అరెస్టు చేసిన పాకిస్థాన్ యువతి పేరు సమీరా కాగా, ఈమెను కేరళకు చెందిన యువకుడు మహ్మద్ షిహాబ్ (30) ప్రేమించాడు. అలాగే పాకిస్థాన్‌కు చెందిన కిరణ్ గులాం అలీ (25), ఖాసిఫ్ షంషుద్దీన్ (30) అనే యువతీ యువకులు ప్రేమించుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు ప్రేమ జంటలు బెంగుళూరు జైలులో ఊచలు లెక్కిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నతల్లిని పీక కోసి చంపి.. రక్తాక్షరాలు రాసిన తనయుడు.. ఎక్కడ?